KTR: ఫ్రీ బస్సుల్లో మహిళల తన్నులాటలపై కేటీఆర్ కామెంట్స్
సోషల్ మీడియాను నమ్ముకుని మోదీ ప్రధాని అయ్యారని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేటీఆర్ చెప్పారు.

KTR
బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ కేసులకు భయపడొద్దని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని.. మున్ముందు ఏదైనా జరగొచ్చని చెప్పారు. తప్పుడు కేసులు, అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
కరీంనగర్లో కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సీఎం సీటు సోషల్ మీడియా పుణ్యమేనని చెప్పారు. ఫ్రీ బస్సులో గొడవలు జరుగుతున్నాయని, అసలు రాష్ట్రంలో రవాణా మంత్రి ఉన్నారా? అని నిలదీశారు.
రవాణా శాఖ మంత్రి వీటి గురించి పట్టించుకోరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇటువంటి పథకాలతో ఎవరు సంతృప్తిగా ఉన్నారని అడిగారు. 2014తో పాటు 2018లో బీఆర్ఎస్‌కు ప్రజలు అధికారాన్ని ఇచ్చారన్నారు. గెలుపుతోని పొంగి పోవద్దని, ఓటమితో కుంగిపోవద్దని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో సానుభూతి ఉండదని అన్నారు.
రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, 420 హామీలిచ్చిందని అన్నారు. ఎమ్మెల్యేలు హామీలు నెరవేర్చకపోతే ఉపేక్షించబోమని చెప్పారు. కరెంట్ బిల్లు కట్టవద్దని రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి చెప్పారని అన్నారు.
సోషల్ మీడియాను నమ్ముకుని మోదీ ప్రధాని అయ్యారని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేటీఆర్ చెప్పారు. రైతులు ఇప్పటికే మంట మీదున్నారని కేటీఆర్ అన్నారు. మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు.
వైసీపీకి మరో షాక్..! పవన్ కల్యాణ్‌తో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ