Ktr Surprise Gift : పార్టీ కార్యకర్త కూతురికి కేటీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

టీఆర్‌ఎస్‌ కార్యకర్త చూపిన నిబద్ధతకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మినిష్టర్ కేటీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పార్టీ యాక్టివిస్ట్ కూతురు పుట్టినరోజు సందర్భంగా అనూహ్య కానుకను పంపి ఆశ్చర్యానికి గురిచేశారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఖాజా నవాజ్‌ హుస్సేన్‌ పార్టీ ఆదేశం మేరకు..

Ktr Surprise Gift : పార్టీ కార్యకర్త కూతురికి కేటీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్

Ktr Surprise Gift

Updated On : March 14, 2021 / 8:32 AM IST

Ktr Surprise Gift: టీఆర్‌ఎస్‌ కార్యకర్త చూపిన నిబద్ధతకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మినిష్టర్ కేటీఆర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పార్టీ యాక్టివిస్ట్ కూతురు పుట్టినరోజు సందర్భంగా అనూహ్య కానుకను పంపి ఆశ్చర్యానికి గురిచేశారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఖాజా నవాజ్‌ హుస్సేన్‌ పార్టీ ఆదేశం మేరకు సుమారు 20 రోజులపాటు హైదరాబాద్‌లో ఉండి పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

అదే సమయంలో నవాజ్‌ హుస్సేన్‌ మామ మరణించాడు. అంత్యక్రియలకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. మరోవైపు 9 నెలల నిండు గర్భిణి అయిన భార్యకు ఫోన్‌లో దైర్యం చెప్తూ హైదరాబాద్‌లో పార్టీ ప్రచార బాధ్యతలు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై పార్టీ నేతలు, కార్యకర్తలతో శుక్రవారం కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు తెలిసింది.

యోగ క్షేమాలు తెలుసుకుంటున్న సమయంలో శనివారం తన కూతురు నబీలా మహమ్మద్‌ పుట్టినరోజు ఉందని నవాజ్‌ హుస్సేన్‌ చెప్పాడు. పార్టీపట్ల కార్యకర్త చూపిస్తున్న అభిమానానికి ఏదో ఒకటి చేయాలని భావించిన కేటీఆర్‌ శనివారం లోకల్ లీడర్ల ద్వారా నబీలాకు ట్యాబ్‌తోపాటు కేక్, కొన్ని బొమ్మలు పంపించారు. అంతటితో సరిపెట్టకుండా పాపకు స్వయంగా ఫోన్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పాపను ఏమైనా కావాలా.. అని అడగ్గా ‘ఏమీ వద్దు.. తెలంగాణ గెలిస్తే చాలు’ అని సమాధానం ఇచ్చింది. పార్టీ పట్ల కార్యకర్తల నిబద్ధత, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఈ ఘటన నిదర్శనమని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌కు కార్యకర్తల అంకితభావమే బలమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, ఏ ఆపద వచ్చినా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.