Kavitha: కవిత రాజీనామాకు ఆమోదం.. నెక్ట్స్ ఏం జరగనుంది?
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు కవిత.
Kavitha Representative Image (Image Credit To Original Source)
- కవిత రాజీనామాకు ఆమోదం తెలిపిన మండలి చైర్మన్
- 2022లో ఏకగ్రీవంగా ఎన్నిక
- బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ తో పదవికి రాజీనామా
Kavitha: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారు కవిత. అయితే, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి గతేడాది సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. సోమవారం కౌన్సిల్ లో మాట్లాడిన కవిత.. తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దాంతో కవిత రాజీనామాకు ఆమోదం తెలిపారు మండలి చైర్మన్.
2022 జనవరిలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్ కు ఫుల్ మెజార్టీ ఉంది. నాడు కాంగ్రెస్ పోటీ చేయలేదు, బీజేపీ కూడా అభ్యర్థిని నిలపలేకపోయింది. ఆ పరిస్థితుల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2028 వరకు కవిత పదవీ కాలం ఉంది. అయితే రెండున్నర సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ఆమె రిజైన్ చేసేశారు.
మండలి సభ్యత్వానికి గతంలోనే రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత… అందుకు కారణాలను సభలోనే వివరించారు. తెలంగాణ జాగృతి సంస్థ ఏర్పాటు, ఉద్యమంలో పాత్ర, అధికారం వచ్చాక తనకు సొంత పార్టీలో జరిగిన అవమానాల గురించి చెబుతూ… ఒక దశలో కంటతడి పెట్టుకున్నారామె. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరారు. అయితే భావోద్వేగాల మధ్య రాజీనామా చేయడం సరైంది కాదని, ఆ విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
Also Read: కవిత రాజీనామాకు ఆమోదం.. తెలంగాణలో మరో ఉపఎన్నిక ఖాయం..?
