Warangal Liquor Mafia : వరంగల్ లిక్కర్ హనీ ట్రాప్..మద్యం మాఫియాతో పోలీసులకు లింకులు
వరంగల్ లిక్కర్ హనీ ట్రాప్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వరంగల్ లిక్కర్ మాఫియాతో పోలీసులకు లింకులు ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Liqor Mafia
Warangal Liquor Honey Trap : వరంగల్ లిక్కర్ హనీ ట్రాప్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వరంగల్ లిక్కర్ మాఫియాతో పోలీసులకు లింకులు ఉన్నట్టు తెలుస్తోంది. మద్యం మాఫియా కుంభకోణంపై పోలీసు ఉన్నతాధికారులు అత్యంత వేగంగా విచారణ జరుపుతున్నారు. విచారణ కోసం రంగంలోకి దిగిన ఇంటెలీజెన్స్, టాస్క్ ఫోర్స్ బృందాలు.. లిక్కర్ సిండికేట్ ఆర్థిక వ్యహారాలను పరిశీలిస్తున్నారు. ప్లైట్ టికెట్స్, క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు, బడా షాపింగ్ మాల్స్‌లో షాపింగ్‌లు జరిగినట్టు గుర్తించింది.
మద్యం సిండికేట్ నుంచి పెద్ద ఎత్తున చెల్లించిన ముడుపులపై డైరీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా మద్యం మాఫియా గుప్పెట్లోకెళ్లిన పోలీసు అధికారులు.. మాఫియా చెప్పినట్టుగా చేస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ కు సంబంధించిన 18 సీఐలు, 4 ఏసీపీలకు సంబంధించిన వివరాలను సేకరించారు ఇంటలీజెన్స్ అధికారులు. మద్యం వేలం పాటలు, బ్యాంకులో తనఖా పడ్డ ఆస్తుల వేలంలు, వివాదాస్పద భూముల కొనుగోళ్లలో బినామీలతో పోలీసుల కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. పోలీసుల అక్రమ దందాపై ఇంటెలిజెన్స్ వివరాలు సేకరిస్తోంది.
Warangal : పోలీసు అధికారులకు అమ్మాయిలను ఎరగా వేసి..వరంగల్‌లో లిక్కర్ డాన్
వరంగల్‌లో లిక్కర్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ సంపాదనే టార్గెట్‌గా అక్రమాలకు పాల్పడుతోంది. వాళ్లను, వీళ్లను కాదు… తమ దందా కోసం ఏకంగా పోలీసులనే ట్రాప్ చేశారు. అమ్మాయిలను ఎరవేసి సీఐలను ట్రాప్ చేశారు. పోలీసులకు అందిన రహస్య కంప్లైంట్‌తో లిక్కర్ మాఫియా అక్రమాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు. ఈ మధ్యే పోలీసులకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్తపై రహస్య కంప్లైంట్ అందింది. తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషే స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.
లిక్కర్ డాన్‌ను, ప్రజాప్రతినిధి భర్తను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరూ కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లిక్కర్ మాఫియా డొంక కదులుతోంది.తన దందా కోసం లిక్కర్ డాన్ ఏకంగా సీఐలనే ట్రాప్ చేసినట్టు, అమ్మాయిలను ఎరవేసి తన దందాకు అడ్డుపడకుండా చూసినట్టు తెలుస్తోంది. అమ్మాయిలతో కలిసి పోలీసులకు విదేశీ టూర్ల అరెంజ్ చేసినట్టుగా విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం.