Telangana Lockdown : తెలంగాణలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి ఇప్పుడు కొనగిస్తున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే..నాలుగు గంటల పాటు ఉన్న సడలింపును..పొడిగించాలని..ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతినివ్వనున్నారని సమాచారం.

Telangana Lockdown : తెలంగాణలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు

Tg Lock Down

Updated On : May 30, 2021 / 4:45 PM IST

Lockdown Extension : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి ఇప్పుడు కొనగిస్తున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే..నాలుగు గంటల పాటు ఉన్న సడలింపును..పొడిగించాలని..ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతినివ్వనున్నారని సమాచారం. మే 12వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

2021, మే 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా లాక్ డౌన్ తో పాటు వివిధ కీలక అంశాలపై చర్చ జరగుతోంది. జూన్ 06వ తేదీ వరకు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే లాక్ డౌన్ సంబంధించి అనేక చర్చలు కొనసాగాయి. ఫీవర్ సర్వేను మరింత వేగవంతం చేయాలని, కరోనా లక్షణాలున్న వారికి వైద్య సేవలు అందించాలని సూచించింది. మరోవైపు..కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎరువులు, విత్తనాలు నకిలీల విషయంలో కఠినంగా ఉండాలని, ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read More : Skeletons Mystery : ‘యాస్’ తుఫాను గాలుల ధాటికి..ఇసుకలోంచి బైటపడ్డ ఐదు అస్థిపంజరాలు