Congress Mp Candidates List : ఆ 4 స్థానాల్లో టికెట్ కోసం తీవ్ర పోటీ

ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా ముందుగానే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కు.. మిగిలిన 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడం చాలా టఫ్ టాస్క్ గా మారింది.

Congress Mp Candidates List : ఆ 4 స్థానాల్లో టికెట్ కోసం తీవ్ర పోటీ

Updated On : March 21, 2024 / 10:20 PM IST

Congress Mp Candidates List : తెలంగాణ కాంగ్రెస్ లో లోక్ సభ అభ్యర్థుల ఖరారు అనేది ఆ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న రేవంత్ రెడ్డికి లోక్ సభ ఎన్నికలు ఒక సవాల్. కచ్చితంగా 10 లేదా 12 సీట్లు దక్కించుకుంటేనే తెలంగాణలో తమ ఇమేజ్ ను కాపాడుకునే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డికి. అందుకే అభ్యర్థుల ఎంపికలో చాలా సీరియస్ గా రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అటు అధిష్టానానికి పేర్లను పంపడంలో కానీ, సామాజిక సమీకరణాలు సమతుల్యం చేయడంలో కానీ రేవంత్ రెడ్డి చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మేజర్ బాధ్యతలను రేవంత్ రెడ్డి భుజాలపై మోపింది కాంగ్రెస్ హైకమాండ్.

తొలి జాబితాలో ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తొలి జాబితా విడుదలై 15 రోజులైంది. మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్, మహబూబాబాద్ బలరామ్ నాయక్, నల్గొండ నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి నాలుగో అభ్యర్థిగా ప్రకటించారు.

ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా ముందుగానే నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కు.. మిగిలిన 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయడం చాలా టఫ్ టాస్క్ గా మారింది. అయినప్పటికీ దాదాపు అభ్యర్థులు ఖరారైనట్లుగా తెలుస్తోంది. 9మంది అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. వారి పేర్ల ప్రకటించడమే తరువాయి. మరొక 4 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినప్పటికీ.. అక్కడ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది.

ఆ నాలుగు టఫ్ టికెట్ ఫైట్ ఉన్న స్థానాలు ఏంటి? 9 ఆల్రెడీ ఖరారై ఏ క్షణమైనా జాబితా ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్న ఆ 9మంది పేర్లు ఏంటి?

Also Read : ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు.. సీఎం రేవంత్‌పై సీనియర్లు సీరియస్