పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం : అమ్మాయి మృతి… అబ్బాయి పరిస్థితి విషమం

Love couple commits suicide : ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. వీరిలో అమ్మాయి చనిపోవడంతో అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్ రెడ్డి పల్లికి చెందిన కీర్తన, బాల్ రాజ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.
ఈ విషయం వాళ్ల పెద్దలకు తెలియడంతో గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ప్రేమికులు చనిపోయేందుకు పురుగులు మందు తాగారు. అయితే విషయం పెద్దలకు తెలియడంతో ఇద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించారు.
అప్పటికే కీర్తన చనిపోవడంతో బాల్ రాజ్ కొన ఊపిరితో ఉన్నాడు. మెరుగైన చికిత్స కోసం అతన్ని హైదరాబాద్ కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కీర్తన చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అబ్బాయి ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉందని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా ఈ ఘటనలో చనిపోయిన కీర్తన మైనర్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.