Lovers Suicide : పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని..రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్న యువతి, డిగ్రీ మధ్యలో ఆపేసిన యువకుడు స్కూల్లో చదువుకున్నప్పట్నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో అడ్డుపడతారని భయపడ్డారు.

Lovers Suicide : పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని..రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

Suicide (1)

Updated On : June 23, 2022 / 8:12 PM IST

Lovers suicide : వికారాబాద్‌ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. రైలు కిందపడి ఇద్దరు మైనర్లు ప్రాణాలు తీసుకున్నారు. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరని సూసైడ్‌ చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతులు కలిచర్ల, ఎబ్బనూర్‌ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్న యువతి, డిగ్రీ మధ్యలో ఆపేసిన యువకుడు స్కూల్లో చదువుకున్నప్పట్నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో అడ్డుపడతారని భయపడ్డారు.

Telangana : మైనర్ ప్రేమికులు ఆత్మహత్య- ప్రేమజంట వీడియో వైరల్

గ్రామ శివారులో ఉన్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పిల్లల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.