బంగాళాఖాతంలో అల్పపీడనం..నేడు, రేపు భారీ వర్షాలు

  • Published By: bheemraj ,Published On : July 6, 2020 / 01:46 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం..నేడు, రేపు భారీ వర్షాలు

Updated On : July 6, 2020 / 9:02 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రధానంగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాగల రెండ్రోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దేశంలో నైరుతి పవనాలు చరుగ్గా కదులుతున్నాయి. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడనుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవాకశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

మరోవైపు తూర్పుమధ్య బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.

Read Here>> 466 మంది పోలీసులకు కరోనా : డీజీపీ గౌతం సవాంగ్