దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతం

  • Published By: madhu ,Published On : October 22, 2020 / 09:58 AM IST
దీక్షిత్ కిడ్నాప్ విషాదాంతం

Updated On : October 22, 2020 / 10:50 AM IST

Mahabubabad kidnapping tragedy: Dixit killed : మహబూబాబాద్ కిడ్నాప్ చివరకు విషాదంగా ముగిసింది. 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డిని చంపేశారు. అడిగినంత డబ్బు ఇస్తామని దీక్షిత్ తల్లిదండ్రులు ఎంత బతిమాలుకున్నా కిడ్నాపర్లు కనికరించలేదు.



ఎక్కడ తాము దొరికిపోతామోనన్న భయంతో అమాయక చిన్నారిని అన్యాయంగా బలితీసుకున్నారు. నాలుగు రోజులుగా బిడ్డ తిరిగి వస్తాడని ఆశగా తల్లిదండ్రులు ఎదురుచూశారు. కానీ దీక్షిత్ మరణవార్త విని కుప్పకూలిపోయారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు.



https://10tv.in/mahabubabad-dixit-kidnap-killed-by-his-fathers-friend/
ఆదివారం సాయంత్రం దీక్షిత్‌ కిడ్నాప్‌ అయ్యాడు. బిడ్డ కనిపించకపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు ఆ రోజు రాత్రంతా అయినవాళ్ల దగ్గర, బంధువుల దగ్గర ఆరాతీశారు ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వైపు పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే కిడ్నాపర్ దీక్షిత్ తల్లికి కాల్ చేశారు.



రూ. 45లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీక్షిత్ తల్లి మాత్రం తన బిడ్డకు ఎలాంటి అపాయం తలపెట్టొద్దని.. డబ్బు ఎంత కావాలన్నా ఇస్తామని వేడుకుంది. కానీ కిడ్నాపర్ దీక్షిత్‌ను వదల్లేదు. కిడ్నాపైన మరుసటి రోజు మధ్యాహ్నం వరకు రెండుసార్లు కాల్ చేసిన కిడ్నాపర్ ఆ తర్వాత మళ్లీ చేయలేదు. దీంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన మొదలైంది.



మంగళవారం రాత్రి మళ్లీ కాల్ చేసిన కిడ్నాపర్‌ డబ్బు మొత్తం సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అడ్రస్‌ ఎక్కడ.. ఎంటన్నది వివరాలు మళ్లీ చెబుతామని అన్నారు. ఆ తర్వాత మళ్లీ కాల్‌ చేసి డబ్బులు సిద్ధం చేశారా లేదా ప్రశ్నించాడు. బుధవారం ఉదయం కాల్‌చేసి.. డబ్బును వీడియో కాల్‌లో చూపించాలని కిడ్నాపర్‌ డిమాండ్‌ చేశాడు.



డబ్బు ఇవ్వకపోతే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. డబ్బు ఎక్కడికి తీసుకురావాలో మరోసారి ఫోన్‌ చేసి చెబుతానన్నాడు. కిడ్నాపర్‌ అన్నట్టుగానే మరోసారి బాలుడి పేరెంట్స్‌కు ఫోన్‌ చేసి ప్లేస్‌, టైమ్‌ చెప్పాడు. దీంతో దీక్షిత్‌ తండ్రి డబ్బులు తీసుకుని కిడ్నాపర్ చెప్పిన మూడు కోట్ల ప్రాంతానికి వెళ్లారు. కిడ్నాపర్‌ చెప్పిన ప్లేస్‌లో అతడి కోసం ఎదురు చూశాడు.



ఇంతలోనే మరోసారి ఫోన్‌ చేసి మరో ప్లేస్‌కు రావాలన్నాడు. దీంతో అక్కడికి వెళ్లినా కిడ్నాపర్‌ మాత్రం రాలేదు. డబ్బు సిద్ధంగా ఉందని చెప్పినా.. తీసుకోవడానికి ఎవరూ రాలేదు. దీంతో తల్లిదండ్రులు అర్థరాత్రి వరకు వేచి చూశారు.



మరోవైపు పోలీసులు కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేశారు. కిడ్నాపర్‌ ఇంటర్నెట్ ద్వారా కాల్ చేయడంతో అతని ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. టెక్నాలజీ సహాయంతో నాలుగు రోజులు ఇటు పోలీసులకు.. అటు దీక్షిత్ తల్లిదండ్రులకు ముచ్చెమటలు పట్టించాడు. కిడ్నాప్‌ ట్రేస్ చేసేందుకు పోలీసులు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. దీక్షిత్‌ కిడ్నాప్‌ ఎపిసోడ్‌ను ఛేదించేందుకు ఇద్దరు డీఎస్పీలు, 8మంది సీఐలు, 15మంది ఎస్సైలు, వంద మంది కానిస్టేబుళ్లు రంగంలోకి దిగారు.



అలాగే 4 ఇంటెలిజెన్స్ టీమ్స్‌తో పాటు మరో 4 ఎస్‌ఐబీ టీమ్‌లు కిడ్నాప్‌ ఛేదించేందుకు అహారహం శ్రమించాయి. నిందితుడు ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్ చేయడంతో ట్రేస్‌ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. దీంతో హైదరాబాద్‌ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు ఐటీ కోర్‌ టీమ్‌ కూడా మహబూబాబాద్‌కు చేరుకుంది.



డబ్బు సిద్ధం చేసుకున్న తర్వాత బుధవారం కిడ్నాపర్‌ ఫోన్‌ చేసినప్పుడు తల్లి ఆ డబ్బును చూపిస్తున్న దృశ్యాలు అందర్నీ కంటతడిపెట్టించాయి. డబ్బు సిద్ధం చేశామని తన బిడ్డను వదిలేయమని కిడ్నాపర్లను వేడుకుంది. కానీ కర్కశకులు తల్లి మాటలను వినిపించుకోలేదు. దీక్షిత్ ను చంపేశారు.