KTR : కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి..?
అనుమతి లేకుండా రెండు విడతలుగా కోట్ల రూపాయలను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడంపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది.

KTR : ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు రాజ్ భవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్ ను గవర్నర్ ఆమోదించినట్లు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలంటూ గత నెలలో ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసింది. ఇక న్యాయ సలహా అనంతరం ఫైల్ పై గవర్నర్ సంతకం చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసులో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగాయని, దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర పురపాలక శాఖ ఈ ఏడాది అక్టోబర్ లో అవినీతి నిరోధక శాఖకు లేఖ రాసింది. ఈ కార్ రేసులో సంబంధం లేని హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వ్ బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండా రెండు విడతలుగా కోట్ల రూపాయలను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడంపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా హెచ్ఎండీఏ బోర్డు అనుమతి లేకపోవడాన్ని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించింది.
పురపాలక శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజినీర్ తో పాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఇదే సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని నవంబర్ లో గవర్నర్ కు లేఖ రాసింది.
ఇక కేటీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన లేఖపై గవర్నర్ సంతకం చేసినట్లు సమాచారం. ఇక, ఈ ఫైల్ కు సంబంధించి అటార్నీ జనరల్ న్యాయ సలహా తీసుకున్నట్లు సమాచారం. అక్కడి నుంచి లీగల్ ఒపీనియన్ రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్ పై గవర్నర్ సంతకం చేసినట్లుగా సమాచారం. ఈ మేరకు ప్రభుత్వానికి ఫైల్ చేరినట్లు సచివాలయ వర్గాలకు సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు రాజ్ భవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైల్ ను గవర్నర్ ఆమోదించినట్లు సమాచారం.
Also Read : అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్..