చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు

చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

చార్మినార్‌ పరిధి గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు

major fire broke

Updated On : May 18, 2025 / 10:52 AM IST

Hyderabad: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. ముగ్గురు స్పాట్ లో మృతిచెందగా.. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

 

ప్రమాద సమయంలో భవనంలో 30మంది వరకు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఏసీ కంప్రెసర్ పేలిడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సెల్లార్ తోపాటు ఫస్ట్ ఫ్లోర్ లో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకొని 16మందిని కాపాడారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల్లో అభిషేక్ మోడీ(30), ఆరుషి జైన్(17), హర్షాలీ గుప్తా(07), శీతల్ జైన్(37), రాజేంద్ర కుమార్(67), సుమిత్ర(65), మున్నీ భాయి(72), ఇరాజ్(2) ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

 

ఘటన స్థలిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం. చాలా పెద్ద ప్రమాదం ఇది. ముత్యాలు అమ్మే షాప్ లో ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది, పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘటన స్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాద ఘటన‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొన్నంకు ఫోన్ చేసి ఆరాతీశారు. బాధితులకు అండగా ఉంటామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.