Makar Sankranti 2024: పండుగ పిండి వంటలు అంటే ఈ సావిత్రమ్మ గుర్తుకురావాల్సిందే..

సావిత్రమ్మ ఓ చిన్న గదిలో పిండి వంటల వ్యాపారాన్ని ప్రారంభించి విదేశాలకు పార్సిల్స్ పంపించే స్థాయికి ఎదిగారు.

Makar Sankranti 2024: పండుగ పిండి వంటలు అంటే ఈ సావిత్రమ్మ గుర్తుకురావాల్సిందే..

Sakinala Savithramma

వేడుక, పండుగ ఏదైనా.. పిండి వంటలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే ముందుగా పిండి వంటలు గుర్తుకువస్తాయి. సంక్రాంతి అంటేనే నోరూరించే పిండి వంటలు. ఈ కాలంలో ఇళ్లలో పిండి వంటలు చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది.

ఒకప్పుడు సంక్రాంతి అనగానే వారం రోజుల ముందు నుంచి హడావిడి కనిపించేది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా అందరూ పండగకు కావాల్సిన పదార్థాలను ఇంట్లోనే తయారు చేసుకునేవారు. ప్రస్తుతం చాలా మంది ఇంట్లో చేసుకోకుండా బయట ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల వారిలోనూ ఇదే ధోరణి కనపడుతోంది. గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

Also Read: Makar Sankranti 2024: సంక్రాంతి ఫుడ్.. నాటుకోడి పులుసు, సూరన్‌ వడల తయారీ ఎలా?

నాణ్యత, శుభ్రత పాటిస్తూ అన్ని రకాల పిండి వంటలు అందించే దుకాణాలు హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి పండుగ పిండి వంటలు అంటే సకినాల సావిత్రమ్మ గుర్తుకువస్తారు. ఆమె ఓ చిన్న గదిలో పిండి వంటల వ్యాపారాన్ని ప్రారంభించి విదేశాలకు పార్సిల్స్ పంపించే స్థాయికి ఎదిగారు.

అనేక రకాల పిండివంటలు ఆమె వద్ద లభిస్తాయి. 80 ఏళ్ల వయసులోనూ సావిత్రమ్మ సంక్రాంతి పండుగ నాడు మరోసారి సందడిగా కనపడ్డారు. సకినాల సావిత్రమ్మ గురించి పూర్తి వివరాలు ఆమె మాటల్లోనే విందామా?