Bhatti Vikramarka: సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే 99 శాతం పూర్తయింది: భట్టి విక్రమార్క
అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని భట్టి విక్రమార్క చెప్పారు.

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే 99 శాతం పూర్తయిందని త్వరలో ప్రజల ముందు పెడతామని తెలిపారు.
అంబేద్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని భట్టి విక్రమార్క చెప్పారు. జీవితంలో అనేక అవమానకర సంఘటనలపై ఆయన పాజిటివ్ గా స్పందించారని తెలిపారు. దేశంలోని సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే దిక్కని చెప్పారు. దేశంలో అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయని, అవి జాతుల పోరాటంలో వృథా అవుతున్నాయని తెలిపారు.
అది లేకుంటే భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకునేదని భట్టి విక్రమార్క చెప్పారు. విద్య ద్వారా మాత్రమే సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని భావించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యారంగంలో ఖర్చు చేస్తుందని తెలిపారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శ్రమించడమే అంబేద్కర్ కు ఘన నివాళని చెప్పారు.
Eatala Rajender: ఈ రెండు పార్టీలు డ్రామా కంపెనీలు: ఈటల రాజేందర్