Hyderabad Markets : దసరా పండగతో హైదరాబాద్‌ లో రద్దీగా మార్కెట్లు

హైదరాబాద్‌లో దసరా పండుగతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. పండగ సరుకులు కొనుగోలు చేసేందుకు గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు జనాలు భారీగా తరలివచ్చారు. పువ్వులు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.

Hyderabad Markets : దసరా పండగతో హైదరాబాద్‌ లో రద్దీగా మార్కెట్లు

Market (1)

Updated On : October 14, 2021 / 12:32 PM IST

markets Crowded in Hyderabad : హైదరాబాద్‌లో దసరా పండుగతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. పండగ సరుకులు కొనుగోలు చేసేందుకు గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కు జనాలు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా పువ్వులు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. అయితే పండగపూట పువ్వులకు గిరాకీ బాగా పెరిగింది.

అటు అమ్మకందారులు మాత్రం వర్షాలకు పువ్వులు డ్యామేజ్‌ అయ్యి .. గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. ఇటు వినియోగదారులు ధరలు మండిపోతున్నాయని చెబుతున్నారు. ఓవైపు పండగ సరుకుల కోసం జనం మార్కెట్‌కు తరలి రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జాం అయింది.

Aha: దసరా టూ సంక్రాంతి.. ప్రేక్షకులకు నాన్ స్టాప్ పండగే!

అక్కడ ట్రాఫిక్‌ పోలీసులు లేకపోవడంతో మార్కట్‌లోని హమాలీలే ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ప్రతీసారి పండుగ సమయంలో మార్కెట్‌ దగ్గర ట్రాఫిక్‌ పెరుగుతుందని.. ఇక్కడ ట్రాఫిక్‌ పోలీసులను ఏర్పాటు చేయాలని హమాలీలు కోరుతున్నారు.