రైతుల కోసమే మ్యారేజి బ్యూరో.. మహిళలకు ఉచితం

Marriage Beuro అనగానే మనకు గుర్తుకొచ్చేది సాఫ్ట్ వేర్, ఎన్నారై సంబంధాలు. కానీ, దేశానికి వెన్నెముకగా నిలిచి, మూడు పూటలా తినే తిండిని పండించే రైతుకు ఎన్ని ఎకరాలున్నా పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకురారు. అలాంటి వారి కోసం వ్యవసాయం చేసే యువకులకు పెళ్లి సంబంధాలు చూడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రైతు కేతిరెడ్డి అంజిరెడ్డి.
ఈ మేరకు ‘రైతు మ్యారేజీ బ్యూరో’ను ఏర్పాటు చేశాడు. వరుడు, వధువు కావాలనుకునే వారు కేవలం రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే వారి తాహతుకు తగ్గట్టు మంచి సంబంధం చూస్తామని, అలాగే మహిళలకు, కూలీలకు ఫీజు లేకుండా ఉచితంగా సంబంధం చూసిపెడతామని అంజిరెడ్డి చెబుతున్నారు.
https://10tv.in/mother-in-law-dances-holding-her-son-in-law-in-her-lap-video-goes-viral-in-westbengl/
దీనిపై ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వాలు చేపడుతున్న రైతాంగ సంక్షేమ పథకాలతో వ్యవసాయ రంగం రూపు రేఖలు మారిపోయాయి. పారిశ్రామిక రంగంతో పోటీపడుతున్న వ్యవసాయ, అనుభంధ రంగాల్లో స్థిరపడ్డవారికి సంబంధాలు కలిపి మంచి జీవితాన్ని ఇవ్వాలన్నదే తన ఆశయమంటున్నాడు అంజిరెడ్డి.