Young Woman Killed : ప్రేమించలేదన్న కోపంతో యువతిని హత్య చేసిన పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తి
ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బుడే దీప (19) అనే యువతిని కమలాకర్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీప అతడి ప్రేమను నిరాకరించారు. అయినా వినకుండా తనతోనే మాట్లాడాలని, తనతో కాకుండా వేరేవరితో మాట్లాడినా చంపుతానని బెదిరించేవాడు.

young woman killed
Man Killed Young Woman : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమించలేదన్న కోపంతో ఓ యువతిని హత్య చేశాడు. యువతికి బలవంతంగా పురుగులు మందు తాగించి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ (టీ) మండలం వెంకట్రావ్ పేట్ కు చెందిన దంద్రే కమలాకర్ (28)కు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బుడే దీప (19) అనే యువతిని కమలాకర్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీప అతడి ప్రేమను నిరాకరించారు. అయినా వినకుండా తనతోనే మాట్లాడాలని, తనతో కాకుండా వేరేవరితో మాట్లాడినా చంపుతానని బెదిరించేవాడు. ప్రతి రోజు వాట్సాప్ లలో అసభ్యకరమైన మెసేజ్ లు పంపించేవాడు. పరువు పోతుందేమోనని దీప ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
Bengaluru: యూనివర్సిటీలో యువతి హత్య.. పెళ్లికి ఒప్పుకోనందుకు కత్తితో పొడిచి చంపిన యువకుడు
ఈ క్రమంలో సెప్టెంబర్ 17న సాయంత్రం కమలాకర్ దీప ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న పిల్లలను బయటికి పంపించాడు. ఇంట్లో ఉన్న పురుగల మందును యువతికి కమలాకర్ బలవంతంగా తాగించి పారిపోయాడు. దీప బయటికి వచ్చి కేకలు వేయగా స్థానికులు వెంటనే యువతిని చికిత్స నిమిత్తం సిర్పూర్ (టీ) ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాగజ్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
యువతిని అక్కడి నుంచి మెరుగుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దీప సోమవారం మృతి చెందారు. పోలీసులు కమలాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కౌటల సీఐ సాధిక్ పాషా, సిర్పూర్ (టీ) ఎస్ఐ దీకొండ రమేశ్ పేర్కొన్నారు.