Marsukola Saraswathi : రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేశారు, శ్యామ్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తా : మర్సుకోల సరస్వతి
టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు సరస్వతి. డబ్బులు ఇచ్చిన శ్యామ్ నాయక్ కు టికెట్ ఇచ్చారు అంటూ ఆరోపించారు. శ్యామ్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తానంటూ శపథం చేశారు.

Marsukola Saraswathi
Telangana Assembly Elections 2023 : టికెట్ ఆశించి భంగం పడ్డ నేతలు ఆగ్రహాలతో తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తుల పెరుగుతోంది. మొదటి జాబితాలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో కొంతమంది ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రెండో జాబితాను విడుదల చేయటంతో అసంతృప్తుల లిస్టు పెరిగింది. జాబితాలో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన కొందరు నేతలకు నిరాశ ఎదురవ్వటంతో ఆగ్రహాలు పెల్లుబుకుతున్నాయి.
దీంట్లో భాగంగా అసిఫాబాద్ టికెట్ ఆశించి భంగపడ్డ మర్సుకోల సరస్వతి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె ఆదివాసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. టికెట్ ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బులు ఇచ్చిన శ్యామ్ నాయక్ కు టికెట్ ఇచ్చారు అంటూ ఆరోపించారు.
కాంగ్రెస్‌లో కుర్చీల కోసం కొట్లాట..మోసాలు,దగాలే వారి నైజం : హరీశ్ రావు
రేవంత్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ తనను మోసం చేశారని టికెట్ ఇప్పిస్తామని నమ్మించి తనను నట్టేట ముంచారని డబ్బులకు అమ్ముడిపోయి టికెట్లు ఇస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్యామ్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తాను..అతని ఓటిమి కోసమే తాను ప్రచారం చేస్తానంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్యామ్ నాయక్ ను ఓడించటానికి తాను గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తానంటూ అక్కసు అంతా వెళ్లగ్రక్కారు.
పార్టీ కోసం పనిచేసినవారికి టికెట్లు ఇవ్వకుండా పారాచ్యూట్ లీడర్లకు టికెట్ ఇస్తున్నారని ఇటువంటివి సరికాదన్నారు. అధిష్టానం చెప్పేదొకటి చేసేది మరొకటి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల్ని కాంగ్రెస్ మోసం చేస్తోంది అంటూ ఆరోపించారు. కాగా కాంగ్రెస్ లో సెకండ్ లిస్టులో అయినా తమకు టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడిన నేతల లిస్టు చాలానే ఉంది. మరి వారంతా ఏం చేస్తారో వేచి చూడాలి.