AP-Telangana Border : ఈపాస్ లేకపోవటంతో భారీగా నిలిచిపోతున్నవాహానాలు

తెలంగాణలో లాక్ డౌన్ వేళల్లో సడలింపులు ఇవ్వటంతో, గతంలో ఆంధ్రాకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు.

AP-Telangana Border : ఈపాస్ లేకపోవటంతో భారీగా నిలిచిపోతున్నవాహానాలు

Huge Traffic Jam At Andhra

Updated On : June 13, 2021 / 5:48 PM IST

AP-Telangana Border : తెలంగాణలో లాక్ డౌన్ వేళల్లో సడలింపులు ఇవ్వటంతో, గతంలో ఆంధ్రాకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. నిన్న, ఈరోజు వీకెండ్ కావటంతో గత రెండు రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని రామాపురం చెక్ పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.

తెలంగాణలోకి   ప్రవేశించాలంటే  ప్రభుత్వం ఈ-పాస్ తప్పని సరి చేసింది. దీంతో ఈ-పాస్ లేని వాహనాలను పోలీసులు  వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. దీంతో వాహనాలు కిలోమీటర్లు  మేర బారులు తీరటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది.

శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ-పాస్ ఉన్న 700 వాహనాలను తెలంగాణలోకి  అనుమతించామని… పాస్ లేని 1500 వాహానాలను వెనక్కితిప్పి పంపించామని  కోదాడ ఎస్.ఐ తెలిపారు.