Megastar Chiranjeevi: ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు మెగాస్టార్ చిరంజీవి ఫోన్
మెగాస్టార్ చిరంజీవి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో ఫోన్ లో మాట్లాడారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో ఫోన్ లో మాట్లాడారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మెగాస్టార్ తనతో మాట్లాడిన విషయాలను శంకర్ నాయక్ మీడియాతో పంచుకున్నారు. నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు.. పరిస్థితిలు బాగాలేవు ఆరోగ్యం కాపాడుకోండి అంటూ చిరంజీవి తనకు జాగ్రత్తలు చెప్పారని ఎమ్మెల్యే అన్నారు.
అనంతరం జిల్లాకు ఇచ్చిన ఆక్సిజన్ బ్యాంక్ పై మాట్లాడారని మానుకోట తన అభిమాన కోట మీ మాట కోసం జిల్లాకు ఆక్సిజన్ బ్యాంక్ ఇచ్చాను అని మెగాస్టార్ చెప్పినట్లు శంకర్ నాయక్ తెలిపారు. ఇక జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకు మంజూరు చేసినందుకు గాను ప్రజల తరఫున మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలియచేశారు శంకర్ నాయక్.