Hyderabad : నెక్లెస్ రోడ్‌లో ఆకట్టుకుంటున్న వేస్ట్ బాటిల్..డస్ట్ బిన్
నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ భారీ సైజులో ఉన్న బాటిల్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. దీని ఏర్పాటుకు ఒక కారణం ఉంది. వాటర్ బాటిళ్లు తీసుకుని నీళ్లు తాగిన తర్వాత..ఎక్కడ పడితే అక్కడ బాటిళ్లు పడేస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచన చేసింది.

Dust Bin
Dustbin Looks Like Water Bottle : హైదరాబాద్ మహానగరంలో నెక్లెస్ రోడ్డు..పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. హుస్సేన్ సాగర్..అందులో బుద్ధుడి విగ్రహం..నాలుగు వైపులా ఉండే ప్రదేశాలు చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు విచ్చేస్తుంటారు. ట్యాంక్ బండ్, సంజీవయ్య పార్కు, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్ సాగర్ తదితర ప్రాంతాలు సందర్శించేందుకు ప్రజలు తరలివస్తుంటారు.
పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. తాజాగా…నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ భారీ సైజులో ఉన్న బాటిల్ అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. దీని ఏర్పాటుకు ఒక కారణం ఉంది. వాటర్ బాటిళ్లు తీసుకుని నీళ్లు తాగిన తర్వాత..ఎక్కడ పడితే అక్కడ బాటిళ్లు పడేస్తుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచన చేసింది.
వాటర్ బాటిల్ డిజైన్ లో ఉండే…భారీ డస్ట్ బిన్ ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్ బాటిళ్లను నిర్దేశిత ప్రాంతంలో వేసేలా పర్యాటకులను చైతన్య పరచాలన్నా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఈ వినూత్న ఏర్పాటు చేశారు. బాటిళ్లను నిర్దేశిత ప్రదేశంలో వేయాలని సూచిస్తున్నారు.