Minister Errabelli Dayakar Rao : గాంధీజీ హత్య వెనుక బీజేపీ ఉందని అనుమానం
గాంధీజీ హత్య వెనుక బీజేపీ ఉందని అనుమానం ఉంది అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీని చంపింది ఎవరు అంటూ ప్రశ్నించిన ఎర్రబెల్లి బాపూజీ హత్య వెనుక బీజేపీ ఉందని అనుమానంగా ఉంది అంటూ పాలకుర్తి సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Errabelli Dayakar Rao's sensational comments saying that BJP's hand was behind the assassination of Mahatma Gandhi
TS Minister Errabelli Dayakar Rao : భారత జాతిపిత గాంధీజీ హత్య వెనుక బీజేపీ ఉందని అనుమానం ఉంది అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీని చంపింది ఎవరు అంటూ ప్రశ్నించిన ఎర్రబెల్లి బాపూజీ హత్య వెనుక బీజేపీ ఉందని అనుమానంగా ఉంది అంటూ పాలకుర్తి సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్ర్య ఉద్యమం, సాయుధ పోరాటంలో బీజేపీ పాల్గొనలేదంటూ ఈ సందర్భంగా ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ది కోసమే బీజేపీ విమోచనం అంటూ కాషాయ పార్టీ డ్రామాలాడుతోంది అంటూ విమర్శించారు. విమోచనం గురించి మాట్లాడేటోళ్ళకు సాయుధ పోరాటం గురించి తెలియదంటూ బీజేపీపై విమర్శలు సంధించారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ విమోచనం అంటూ డ్రామాలాడుతోందన్నారు.
మా రాష్ట్రంలో కొత్తగా కడుతున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని..కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనానికి బాబాసాహె అంబేద్కర్ పేరు పెట్టాలి అంటూ డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటే కేంద్రం తిరస్కరిస్తోందని ఆరోపించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ పాలకుర్తి గడ్డ అని అన్నారు. సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
చాకలి ఐలమ్మ, బందగీ, లాంటి వీరులు పుట్టిన నేల పాలకుర్తి అని అన్న ఎర్రబెల్లి చావు అంచులదాకా వెళ్లి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అటువంటి కేసీఆర్ కు ధన్యవాదాలు అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
కాగా..తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ టీఆర్‌ఎస్‌పై ‘విమోచన’ అనే అస్త్రాన్ని సంధించింది. తెలంగాణ విమోచన దినోత్సవంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న క్రమంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 17న జరిగే విమోచన దినోత్సవాన్ని కేంద్రం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాంస్కృతిక, హోం మంత్రిత్వశాఖ అధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. దీంతో బీజేపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. ఇప్పటి వరకు లేనిది ఇప్పుడే విమోచనం దినం అంటూ బీజేపీకి గుర్తుకొచ్చిందా? అంటూ ప్రశ్నిస్తోంది. రాజకీయల లబ్ది కోసం విమోచనం అంటూ డ్రామాలాడుతోంది అంటూ టీఆర్ఎస్ నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు.