Gangul-Itala : మీసం మెలేసి ఈటలకు గంగుల వార్నింగ్..నీ బెదిరింపులకు భయపడేది లేదు..నేను మాట్లాడితే తట్టుకోలేవ్..

Gangul-Itala : మీసం మెలేసి ఈటలకు గంగుల వార్నింగ్..నీ బెదిరింపులకు భయపడేది లేదు..నేను మాట్లాడితే తట్టుకోలేవ్..

Gangul Itala

Updated On : May 18, 2021 / 12:50 PM IST

Minister Gangul Warning to Itala Rajender : తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మంత్రి గంగుల కమలాకర్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈరోజు హుజూరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఈటల మాట్లాడుతూ..‘‘బిడ్డా గంగులా.. అంటూ మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నీ రాజకీయాలు హుజూరాబాద్ లో చెల్లవ్..నీ బెదిరింపులకు నేను భయపడేది లేదు ఆగ్రహం వ్యక్తం చేయగా..దీనికి కౌంటర్ గా గంగుల కమలాకర్ కూడా ఎదురు వార్నింగ్ ఇచ్చారు. మీసం మెలేసి మరీ ఈటెల రాజేందర్ కు వార్నింగ్ ఇచ్చారు. ‘ఈటలా నీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరిక్కడ.. ‘ బిడ్డా గిడ్డా..అంటే నీకంటే ఎక్కువ మాట్లాడతా..నీకు ఆత్మగౌరవం అనేది ఉంటే వెంటనే రాజీనామా చేయాలని గంగుల సవాల్ విసిరారు.

నువ్వు పార్టీని విడిచిపెడితే పార్టీకి నీలాంటివాళ్లు లక్ష మంది ఉన్నారు. పార్టీ ఏమీ గొడ్డు పోదులే..పార్టీని కాపాడుకోవటానికి ప్రాణాలు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. నీలాంటి వాళ్లు పోతే ఏం కాదు అన్నారు. నేను నీలాగా వ్యక్తిగతంగా ఎప్పుడూ మాట్లాడలేదు. నేను నీగురించి మాట్లాడటం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. చాలా భయంకరంగా ఉంటది ఈటెలా జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మేమంతా కేసీఆర్ కు అభిమానులమనీ ఆ పోస్టే మాకు మంత్రి పదవి కంటే ఎక్కువనీ ఈ ఎమ్మెల్యే పదవులు..మంత్రి పదవులు మాకు శాశ్వతం కాదు..కేసీఆర్ అభిమానమే మాకు పెద్ద పోస్టు అని..నీలాగా తిన్న ఇంటి వాసాలు లెక్కబేట్టే వాళ్లం కాదని అన్నారు. ఈటెల ఇప్పడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాడు కాదు. అతని పార్టీలో లేడు..శూన్యంలో ఉన్నాడని ఎద్దేవా చేశారు మంత్రి గంగుల.