Minister Harish Rao : వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేయాలి : హరీష్ రావు

వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జనవరి మొదటివారంలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించాలన్నారు.

Minister Harish Rao : వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేయాలి : హరీష్ రావు

Minister Harish Rao

Updated On : December 6, 2021 / 9:35 PM IST

Warangal Multi Specialty Hospital : వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. జనవరి మొదటి వారంలో ఆసుపత్రి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలపై హైదరాబాద్ లోని బిఅర్ కే భవన్ లో వైద్యం, అర్ అండ్ బి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మెడికల్ కళాశాలల డిజైన్లు పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 8 మెడికల్ కాలేజీల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని సూచించారు. త్వరలో 4 టిమ్స్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్ధాపన చేస్తారని తెలిపారు. ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య తెలంగాణ సాకారం చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు.

Minister Harish Rao : వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి : మంత్రి హరీష్ రావు

వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నారు. 24 అంతస్థులతో భనవ సముదాయం నిర్మించనున్నారు. ఇందులో 2 వేల పడకలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 15 ఎకరాల్లో 11 వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టనున్నారు. 215.35 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలం కేటాయించింది ప్రభుత్వం.

స్పెషాలిటీ వైద్యం కోసం 12 వందల పడకలు ఏర్పాటు చేస్తారు. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ENT, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలు ఉంటాయి. సూపర్ స్పెషాలిటీల కోసం 8 వందల పడకలు ఉంటాయి. వీటిలో అంకాలజి సహా, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ సేవలు అందిస్తారు.

Banjara Hills : కారు బీభత్సం కేసులో నిందితులకు రిమాండ్

కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైద్య కళాశాలను కూడా ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనున్నారు.