Regional Ring Road: రీజనల్ రింగ్ రోడ్డు.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. అన్యాయం జరిగితే ఊరుకోను..

లక్షన్నర కోట్ల విలువ గల ORR ను 7వేల కోట్లకు అమ్ముకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. చరిత్రలో రోడ్లను అమ్ముకున్న పాపం బీఆర్ఎస్ దే.

Regional Ring Road: రీజనల్ రింగ్ రోడ్డు.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. అన్యాయం జరిగితే ఊరుకోను..

Updated On : October 4, 2025 / 10:42 PM IST

Regional Ring Road: రీజనల్ రింగ్ రోడ్డును గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇప్పటికే 90శాతం భూసేకరణ జరిగిందని, మరో రెండు నెలల్లో ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభించి డిసెంబర్ లోపు పూర్తి చేస్తామన్నారు. జనవరిలో పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భూములిచ్చిన ప్రతీ రైతుకు న్యాయం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. నల్లగొండ ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోను అని భరోసా ఇచ్చారు.

”రెండు నెలల్లో ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు టెండర్ ప్రక్రియ ప్రారంభం. డిసెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించేలా చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం RRR ను పట్టించుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాతనే 90 శాతం పైగా భూసేకరణ చేశాం. అందుకు రైతులను ఒప్పించాం.
నాలుగు లేన్ల RRR ను ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా 6 లేన్లుగా మార్చుకున్నాం. కేంద్రం సహకరించాలి.

దక్షిణ భాగం విషయంలో రైతుల అనవసర ఆందోళన చెందొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను రైతులకు అన్యాయం చేసే వాళ్లం కాదు. రైతుల అంగీకారంతోనే ముందుకు పోతాం. ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలో మంత్రుల కమిటీ వేస్తాం. నేను రైతు బిడ్డను. రైతుకు అన్యాయం జరిగితే ఊరుకుంటానా. లక్షన్నర కోట్ల విలువ గల ORR ను 7వేల కోట్లకు అమ్ముకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. చరిత్రలో రోడ్లను అమ్ముకున్న పాపం బీఆర్ఎస్ దే. రోడ్లు అమ్ముకున్న వాళ్లే.. అబద్ధపు ప్రచారాలతో రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారు. నల్లగొండ బిడ్డగా..ఈ గడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోను” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.