Konda Surekha : మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ..
దీంతో ఆయన తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Konda Surekha
Konda Surekha : మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. వరంగల్ నడిబొడ్డున గల ఆజంజాహి కార్మిక భవన్ నేలమట్టం వివాదంలో కొండా మురళి పేరు వినిపిస్తోంది. ఆజంజాహి గుర్తులు చెరిపేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకట్రామ జంక్షన్ సమీపంలోని కార్మిక భవన్ ను ఓ వస్త్ర వ్యాపారి కూల్చేశారు. కొత్తగా నిర్మిస్తున్న కాంప్లెక్స్ కు కొండా మురళి భూమి పూజ చేశారు. దీంతో ఆయన తీరుపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
”ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ప్రజలకు లాభం చేయాలా? సున్నం పెట్టాలా? ఆజంజాహి మిల్.. కార్మికులు 75 ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు కట్టుకుని, సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసిన వ్యక్తివి… ఎలా వచ్చి కొబ్బరి కాయ కొడతారు. వాళ్లు డబ్బులకు కక్కుర్తి పడ్డారు. మీ తెలివి ఏమైంది? చాలా దారుణం. ఇంతకంటే మరొక అన్యాయం లేదు. ఆజంజాహి మిల్లు.. కార్మికులు ఎంతో కష్టపడి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పైసా పైసా వేసుకుని ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. దశాబ్దాలు గడిచాయి. మిల్లు మూత పడింది. కనీసం ఈ స్థలంలోనైనా తమకు ఎంతో భవిష్యత్తు ఇస్తుందని ఆశ పడుతున్నారు. ఈ తరుణంలో ఇలా జరగడం దారుణం. రోడ్డుకు ఆనుకుని ఉంది కాబట్టి ఇది ఎంతో విలువైన స్థలం. భూకబ్జాదారుల కన్ను పడింది. కొందరు వ్యక్తులు ప్రభుత్వ అండదండలతో ఈ విలువైన స్థలాన్ని కాజేయాలని చూడటం అన్యాయం” అని కార్మిక సంఘాల నేతలు వాపోయారు.
Also Read : తెలంగాణ గ్రూప్-2 పరీక్షలో ‘సమైక్య’ ప్రశ్నలు.. ఏపీ వ్యాపారుల ప్రస్తావన దేనికి సంకేతం?