బల్కంపేట ఆలయంలో తోపులాట వెనుక కుట్ర కోణం ఉంది- మంత్రి సురేఖ

బల్కంపేట దేవాలయంలో చోటు చేసుకున్న తోపులాట ఘటనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి సురేఖ.

బల్కంపేట ఆలయంలో తోపులాట వెనుక కుట్ర కోణం ఉంది- మంత్రి సురేఖ

Balkampet Yellamma Temple Incident : బల్కంపేట దేవాలయంలో అమ్మవారి కల్యాణోత్సవం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనపై మంత్రి కొండా సురేఖ సీరియస్ అయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో జరిగిన తోపులాట వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి సురేఖ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ ఇన్వెస్టిగేషన్ చేస్తుందని మంత్రి సురేఖ తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. తోపులాట ఘటనపై పోలీస్ శాఖ రేపటిలోగా నివేదిక సమర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.

బల్కంపేట దేవాలయంలో చోటు చేసుకున్న తోపులాట ఘటనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి సురేఖ. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, బల్కంపేట దేవాలయ ఈవో, రాష్ట్రస్థాయి బోనాల కమిటీ మెంబర్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read : బల్కంపేట ఆలయం వద్ద తోపులాట.. మేయ‌ర్‌కు గాయాలు.. 10టీవీ ప్రతినిధిపై పోలీసుల దురుసు ప్రవర్తన