KTR : దళితబంధు కింద సిల్ట్ కార్టింగ్ వాహనాల పంపిణీ.. 162 మంది అబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు.

KTR : దళితబంధు కింద సిల్ట్ కార్టింగ్ వాహనాల పంపిణీ.. 162 మంది అబ్ధిదారులకు అందజేసిన మంత్రి కేటీఆర్

Silt Carting Vehicles

Updated On : October 2, 2023 / 9:39 AM IST

KTR – Silt Carting Vehicles : దళితబంధు పథకం కింద మురుగు వ్యవర్థాల రవాణా వాహనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. హైదరాబాద్ మహా నగర మంచినీటి సరఫరా, మురుగు నీటి పారుదల మండలి ఆధ్వర్యంలో మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను దళిత బంధు పథకం కింద అందజేస్తున్నారు. సోమవారం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ 162 మంది లబ్ధిదారులకు సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలకు సంబంధించిన 162 మందిని అధికారులు ఎంపిక చేశారు. వీరందరికీ ఒక్కొక్క వాహనం చొప్పున జలమండలి అందజేసింది. వీరికి ఈ వాహనాల వినియోగంపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.

Telangana Government : కుటుంబానికి లక్ష రూపాయలు.. దళితబంధు తరహాలో మైనార్టీలకు ఆర్థికసాయం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్ జిల్లాలకు చెందిన వారికి 88 వాహనాలు, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారికి 35 వాహనాలు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాకు 37, సంగారెడ్డి జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 2 వాహనాలను అందించారు.