Minister KTR : దేశంలో ఎక్కడా లేని విధంగా వర్కర్ టు ఓనర్ పథకం : మంత్రి కేటీఆర్
ఒకప్పుడు సిరిసిల్ల ‘ఉరి సిల్ల’గా ఉండేదని అప్పటికి ఇప్పటికి తేడా చూడండీ..అభివృద్ధి చెందిన సిరిసిల్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి అంటూ యువతకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు.

Minister KTR In Siricilla
KTR BRS Yuva Atmiya Sammelanam Sirisilla : ఎన్నికల ప్రచారంలో దూడుకు పెంచిన బీఆర్ఎస్ నేతలు సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు..తమ పార్టీ చేసిన చేయాల్సిన అభివద్ధి గురించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ యువ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఒకప్పుడు సిరిసిల్ల ‘ఉరి సిల్ల’గా ఉండేదని అప్పటికి ఇప్పటికి తేడా చూడండీ..అభివృద్ధి చెందిన సిరిసిల్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయండి అంటూ యువతకు పిలుపునిచ్చారు. నేతన్న ఆత్మహత్య వద్దంటూ రాతలు సిరిసిల్ల గోడలపై ఉండేవి. .కానీ ఇప్పుడు సిరుల సిల్లాగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు.
సిరిసిల్లలో ఎన్నో విద్యాసంస్థలు వచ్చాయని ఇన్ని వస్తాయని కలలో కూడా ఎవరూ అనుకోలేదని అటువంటి కొత్త సిరిసిల్ల గురించి సోషల్ మీడియాలో ఉన్నది లేనట్లుగా చూపిస్తున్నారని అటువంటి వాటికి సోషల్ మీడియా వేదికగానే సరైన సమాధానం ఇవ్వాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అందరు సిరిసిల్ల, గజ్వేల్ లోనే అభివృద్ధి అంటుంటే, సిరిసిల్ల నాయకులు మాత్రం సిరిసిల్లలో అభివృద్ధి ఏం లేదని అంటున్నారని అటువంటి వారికి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ నాయకత్వం మానేరునది సజీవ ధారగా మార్చిందన్నారు.
సంక్షేమం, అభివృద్ధి ఇలా అన్ని రంగాల్లోను పురోభివృద్ధిని సాదిస్తున్నామని..కానీ ఇవన్నీ కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించవు అంటూ విమర్శించారు.కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికి మాత్రమే వస్తారని అటువంటి నేతలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కుల, మతాలు పేరుతో ప్రజల్ని విభజిస్తారని అటువంటివారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కులాలు, మతాలు చూసి కాదు ఓటు వేసేది గుణం చూసి ఓటెయ్యండని…అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు. నా కులం సంక్షేమం నా మతం మంచి నేను పని చేస్తాను అనుకుంటేనే నాకు ఓటెయ్యండి అని అన్నారు.
సిరిసిల్ల చరిత్రలో మొదటి సారి 2014 సిరిసిల్ల ఎమ్మెల్యే కు మంత్రి పదవి వచ్చిందని…నాకో గుర్తింపు ఉందంటే..దానికి కారణం సిరిసిల్లా ప్రజలేనన్నారు. 14 సంవత్సరాలుగా నా పనితీరు మీ ముందుంది..మీ తలరాత రాసుకునేది మీరే.. దాన్ని మంచిగా ఉపయోగించుకొండి అంటూ సూచించారు.ఇంతకష్టపడి సాదించుకుని,ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అవుతాడట అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు సంధించారు. మెడమీద తల ఉన్నోడు ఎవడైనా అతగాడి చేతిలో రాష్ట్రాన్ని పెడతాడా..? అంటూ ప్రశ్నించారు.ఓటుకు నోటు దొంగ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవుతాడని గాంధీ ఆనాడే ఊహించాడు..అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అంటున్నారు..కానీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఊరికనే ఇవ్వలేదు..వేరే దారి లేకి దిక్కులేని స్థితిలో ఇచ్చారు అని అన్నారు.
Minister Harish Rao : కేసీఆర్ అంటే నమ్మకం .. కాంగ్రెస్ అంటే నాటకం : హరీశ్ రావు
55 ఏళ్లలో చేతకాలేదు కాని ఇప్పుడు అదిలేదు..ఇదిలేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటూ కాంగ్రెస్ పై విమర్శలు సంధించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై కూడా విమర్శలు చేస్తు..లీటర్ డీజిల్ రూ.60 రూ.డిజీల్ రు.100, 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు మోదీ దేవుడా..అంటూ ఎద్దేవా చేశారు.ఓటు వేసే ముందు ఆలోచంచి వేయండీ..విజన్ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కడైనా ఉన్నాడా..? అంటూ ప్రశ్నించారు. ఇంటింటికి వచ్చి ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. మాకు ముఖ్యమంత్రి కెసిఆర్.. రామన్న ఉన్నాడని మీరతా చెప్పాలి అంటూ సూచించారు.