Minister KTR Amendments Municipal Act : మున్సిపల్ చట్టానికి పలు సవరణలు..జీహెచ్ఎంసీలో కోఆప్షన్ సభ్యుల పెంపు : మంత్రి కేటీఆర్
మున్సిపల్ చట్టానికి పలు సవరణలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 5 నుంచి 15 మందికి కోఆప్షన్ సభ్యులను పెంచుకోవడానికి చట్టం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టడాన్ని 3 నుంచి 4ఏళ్లకు పెంచడానికి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

Minister KTR amendments Municipal Act
Minister KTR Amendments Municipal Act : మున్సిపల్ చట్టానికి పలు సవరణలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 5 నుంచి 15 మందికి కోఆప్షన్ సభ్యులను పెంచుకోవడానికి చట్టం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టడాన్ని 3 నుంచి 4ఏళ్లకు పెంచడానికి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. క్యాతనపల్లి పేరును రామకృష్ణపూర్ మున్సిపాలిటీగా మార్పు చేసినట్లుగా పేర్కొన్నారు.
మున్సిపల్ చట్టం ఏం చెబుతోంది ?.. నేతలు తెలుసుకోవాల్సిన విషయాలు
ములుగు జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేస్తూ మున్సిపల్ చట్ట సవరణ చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్సీలు వారి వారి నియోజకవర్గాల్లోని అన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిల్ సమావేశాలకు ఆహ్వానితులేనని స్పష్టం చేశారు. కోఆప్షన్ లో రిజర్వేషన్లు లేవని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇవ్వడంపై పరిశీలిస్తామని చెప్పారు.