మున్సిపల్ చట్టం ఏం చెబుతోంది ?.. నేతలు తెలుసుకోవాల్సిన విషయాలు

మున్సిపల్‌ ఎన్నికలకు అన్నిపార్టీలు సిద్ధమవుతున్నాయి. పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారు పార్టీల వారీగా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే..కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసు

మున్సిపల్ చట్టం ఏం చెబుతోంది ?.. నేతలు తెలుసుకోవాల్సిన విషయాలు

New Project

మున్సిపల్‌ ఎన్నికలకు అన్నిపార్టీలు సిద్ధమవుతున్నాయి. పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారు పార్టీల వారీగా టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే..కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ చట్టంలో పొందుపరిచిన అంశాలేమిటి ? అనే దానిపై నేతలు స్టడీ చేస్తున్నారు. ఈ రూల్స్‌తో కలిగే లాభాలేంటి ? ఎన్నికల సంఘంతో ఎదురయ్యే ఇబ్బందులేంటన్న విషయాలపై నేతలు చర్చిస్తున్నారు.

 

* కొత్త మున్సిపల్ చట్టం ఎన్నికల్లో డబ్బుల ప్రభావానికి కళ్లెం వేసింది. * చట్టం ప్రకారం ఎన్నికల ప్రచార ఖర్చు విషయంలో పరిమితి విధించింది. * వార్డులో పోటీ చేసే అభ్యర్థులు కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. * అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువైనా ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోనుంది. * ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు చేసిన ఖర్చులను ఆడిట్‌లో వివరించాలి.

 

* ఎన్నికల సర్వైకల్‌ బృందాలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఎప్పటికప్పుడు లెక్కలను నమోదు చేస్తారు. * దీనికి సంబంధించి జెండాలు, ఫ్లెక్సీలు, పాంప్లెంట్లు అన్నింటినీ ఎన్నికల ఖర్చుకిందే జమ కడుతారు. * ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.12 వందల 50 చొప్పున, ఓసీలు రూ. 25 వందల చొప్పున నామినేషన్‌ డిపాజిట్‌గా నిర్ధారించారు. * ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రిజర్వు అయిన స్థానాలతో పాటు ఎక్కడ పోటీ చేసినా తహశీల్దార్‌ ధ్రువీకరించిన కులం సర్టిఫికెట్‌ జతపర్చాల్సి ఉంటుంది.

* గత ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే పోటీకి అనర్హులన్న నిబంధన ఉండేది. * కొత్త చట్టం ప్రకారం ముగ్గురు పిల్లలున్నా అంతకన్నా ఎక్కువున్నా పోటీకి అర్హులే. * సంతానంతో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని తెలంగాణ మునిసిపల్‌ చట్టం – 2019 కల్పిస్తోంది.

అయితే..ఈ విషయంలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్థానిక సంస్థల్లో ఈ వెసులు బాటు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తోంది. ఒక్క వర్గం మెప్పుకోసం ప్రభుత్వం ఇద్దరు పిల్లల నిబంధనను తొలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 

ఇదిలా ఉంటే…కేవలం ఒక లక్ష మాత్రమే ఖర్చు పెట్టాలన్న నిబంధనతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఒక్కోవార్డులో 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల ఖర్చు విషయంలోఎన్నికల సంఘానికి పని ఎక్కువగానే ఉండేట్టుంది.

Read More : కోనేరు హంపి : పెళ్లయ్యాక కాంస్యం..తల్లయ్యాక స్వర్ణం