KTR : కేసీఆర్ అందుకే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు.. దేశమంతా ఇటువైపే చూస్తోంది : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోంది. దేశమంతా కామారెడ్డిలో కేసీఆర్ పోటీపైనే చర్చ జరుగుతోంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

KTR : కేసీఆర్ అందుకే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు.. దేశమంతా ఇటువైపే చూస్తోంది : కేటీఆర్

KTR, KCR

Updated On : October 7, 2023 / 6:07 PM IST

Minister KTR : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. దీంట్లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోందని, దేశమంతా కామారెడ్డిలో కేసీఆర్ పోటీపైనే చర్చ జరుగుతోందని అన్నారు. కేసీఆర్ పోటీ వెనుక కామారెడ్డి సస్యశ్యామలం కావాలనే గొప్ప ఆశయం ఉందని తెలిపారు. కేసీఆర్ వస్తున్నారంటే, ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికలతో కేసీఆర్ దక్షిణ భారతదేశంలో ఓ రికార్డు సృష్టించబోతున్నారని.. కేసీఆర్ సౌతిండియా నుంచి హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టించబోతున్నారన్నారు. కేసీఆర్ అభ్యర్థిగా ఖరారైన మరుక్షణం గెలుపు ఖరారైంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అత్యధికంగా మెజారిటీ ఇవ్వాలని.. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు అంటూ అభిప్రాయపడ్డారు. ఒక్క ఓటు వేస్తే ముగ్గురు పని చేస్తారని.. ముదిరాజ్ లకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో గెలిస్తే.. మహారాష్ట్ర రాజకీయ వ్యవస్థ తెలంగాణ వైపు చూస్తుందని.. వచ్చే ఎన్నికల్లో చరిత్ర తిరగరాయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

2004 ఎన్నికల్లో పొత్తులో భాగంగా షబ్బీర్ అలీ కోసం కామారెడ్డి సీటు వదులుకున్నామని.. కానీ కేసీఆర్ పై ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. గంప గోవర్ధన్ ఆహ్వానంతోనే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారని.. కేసీఆర్ పోటీ వెనుక ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలనే గొప్ప ఆశయం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Also Read: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డకౌట్, బీజేపీ రనౌట్, కేసీఆర్ సెంచరీ : హరీష్ రావు