TS 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. 86.60శాతం ఉత్తీర్ణత
తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

TS 10th Exam Results
TS 10th Results: తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్షలు మొత్తం 4.4లక్షల మంది రాయగా.. 86.60శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో బాలురు 84.68శాతం, బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 3.85శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
టెన్త్ ఫలితాల్లో.. 99శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా. కేవలం 59.46శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత సాధించగా, 25 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. జూన్ 14 నుంచి 22 వరకు టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం ఫీజు చెల్లింపు చివరి గడువు మే26 వరకు ఉంటుందని మంత్రి చెప్పారు. మార్కులు రీ కౌంటింగ్ కొరకు ప్రతి సబ్జెక్టుకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
Ap Polycet 2023: ప్రారంభమైన ఏపీ పాలిసెట్ -2023 ప్రవేశ పరీక్ష..
గురుకులాల్లో 98.25శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 72.39శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక.. ప్రయివేట్ విద్యార్థులు 44.51శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా.. ఇందులో 43.06శాతం, బాలికలు 47.73శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాలను https://results. tsbse.telangana.gov.in, https//results. tsbsetelangana. org ద్వారా చూడవచ్చు.
Karnataka Election 2023: జేడీఎస్‌తో పొత్తుపై కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన ప్రకటన
అధైర్య పడొద్దు..
ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం బాధ అనిపించిందని మంత్రి సబితా అన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకునేప్పుడు తల్లితండ్రుల కష్టం గుర్తు తెచ్చుకోండని సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులను కోరారు. వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, మార్కులు తక్కువగా వచ్చినా, ఫెయిల్ అయినా అధైర్య పడవద్దని మంత్రి సూచించారు.