రాష్ట్ర మంత్రి రాసలీలలు బట్టబయలు

Minister Scandal: ఆయన మైక్ పట్టుకుంటే ఊకదంపుడు రాజకీయ ప్రసంగాలు ఇచ్చేస్తాడు. ప్రజా సేవ అంటూ లెక్చర్లు పలికేస్తాడు. ఇదంతా ఓ యాంగిల్.. ఆయనకు మరో యాంగిల్ కూడా ఉందండోయ్.. రెండో వైపు అసలు సిసలు డర్టీ పిక్చర్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ మంత్రి గారి గుట్టు గురించే బహిరంగంగా చర్చ. ఆయన గారి రాసలీలలే రచ్చ.
ఆ మంత్రి గారి రాసలీలలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ మంత్రి సన్నిహితురాలితో చేసిన చాటింగ్ యవ్వారమంతా వైరల్‌గా మారిపోయింది. మంత్రి కోరికలు తీర్చేందుకు ఆయన మనసుపడ్డ యువతితో ఆయన సన్నిహితురాలు చేసిన బ్రీఫింగ్ ప్రయత్నమంతా బయటకు వచ్చేసింది.
టాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాల్లో నటించిన ఓ యువతిపై మంత్రిగారి కన్నుపడగా.. ఇంకేముంది.. తను నాకు కావాలని తన సన్నిహితురాలి ఎదుట ఓపెన్ అయిపోయాడు. సెట్ చేయాలని పురమాయించాడు. వలపు బాణాలు, చిలిపి కోరికలన్నీ చాటింగ్‌లోనే చెప్పుకొచ్చాడు సదరు మంత్రి. మినిస్టర్ ఆర్డర్ వేయడమే ఆలస్యం… సన్నిహితురాలు సీన్‌లోకి ఎంటర్ అయ్యింది. యువతితో మాటా ముచ్చటతో దగ్గరైంది. మంత్రిగారి బ్యాగ్రౌండ్ భలే భలే అంటూ బిల్డప్ ఇచ్చింది. మంత్రిగారి బేరం బాగా ఆలోచించుకోవాలని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. పొలిటికల్ సాన్నిహిత్యం మంచిదంటూ ముగ్గులోకి దింపే ప్రయత్నం చేసింది. కానీ యువతి మాత్రం అంగీకరించలేదు.
అయినా సరే పట్టు వదలకుండా యువతికి గాలం వేసేందుకు మంత్రిగారి సన్నిహితురాలు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆమె లొంగకపోవడంతో దొంగచాటుగా యువతి వ్యక్తిగత ఫోటోలను సీక్రెట్‌గా తన మొబైల్‌లో షూట్ చేసింది. వాటన్నింటిని మంత్రి సెల్ ఫోన్‌కి పంపించేందుకు యత్నించింది. సరిగ్గా అదే టైమ్‌లో మంత్రి సన్నిహితురాలిపై ఆ యువతికి అనుమానం వచ్చి మొబైల్ ఫోన్ లాక్కుని చెక్ చేసింది. అందులో ఫోటోలు చూసి ఆమెకు దిమ్మతిరిగినంత పనైంది. షాక్ నుంచి తేరుకుని హైదరాబాద్‌కు వెళ్లిపోయింది.
మంత్రి గారు ఒకటనుకుంటే.. జరిగింది ఇంకొకటి. దీంతో రాజీ ప్రయత్నాలు షురూ చేశారాయన. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మ్యాటర్ చేయి దాటి.. సీన్ అంతా రివర్స్ అయ్యింది. వ్యవహారం సీన్ టు సీన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి సన్నిహితురాలి ఫోన్‌లోని చాటింగ్‌ను స్క్రీన్ షాట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సదరు యువతి.