కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సంజయ్ చిచ్చు.. రాజీనామాపై వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి..!

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు, జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానులు నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే సంజయ్ చిచ్చు.. రాజీనామాపై వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి..!

Mlc Jeevan Reddy : కాంగ్రెస్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక చిచ్చు రాజేసింది. సంజయ్ కుమార్ చేరికతో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబూనారు. ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకోవడంతో.. మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. శ్రీధర్ బాబు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, జీవన్ రెడ్డి మాత్రం తగ్గేది లేదంటున్నారు. తాను రాజీనామా చేస్తానని మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీలో తనకు తగిన గౌరవం ఇవ్వకపోతే నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా కొనసాగుతానని జీవన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుని ప్రశ్నించారు.

మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు, జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానులు నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

జీవన్ రెడ్డితో మాట్లాడాక మంత్రి శ్రీధర్ బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మాట్లాడుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామన్నారు. పార్టీకి ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారని, నిరంతరం అదే విధంగా ఉండాలని కోరామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

Also Read : పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదం: షబ్బీర్ అలీ