Minister Talasani : ఎన్టీఆర్ ఒక మహాపురుషుడు : మంత్రి తలసాని

ఎన్టీఆర్ రాజకీయంగా యువతకు అవకాశం కల్పించారని కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ మకుటం లేని మహారాజు అని అభిర్ణించారు.

Minister Talasani : ఎన్టీఆర్ ఒక మహాపురుషుడు : మంత్రి తలసాని

Talasani Srinivas

Updated On : May 28, 2023 / 12:05 PM IST

Talasani Srinivas Yadav : ఎన్టీఆర్ ఒక మహాపురుషుడు అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ సినీ నటుడుగానే కాకుండా పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ వేసిన మొక్కలు నేడు చెట్లు అయ్యాయి అని వెల్లడించారు.

ఎన్టీఆర్ రాజకీయంగా యువతకు అవకాశం కల్పించారని కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ మకుటం లేని మహారాజు అని అభిర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎన్టీఆర్ ను స్మరించుకుంటున్నారని తెలిపారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి.. రాజకీయ చరిత్రపై స్పెషల్ ఫోకస్..

తాము చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ అభిమానులుగా ఉన్నామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చరిత్రలో అరుదు అని పేర్కొన్నారు.