MLC Balmuri Venkat : మల్కాజిగిరిలో నాపై పోటీ చేసి గెలిచి చూపించు : కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సవాల్!
MLC Balmuri Venkat : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతానని అన్నారు. సిరిసిల్లలో రాజీనామా చేసి తనతో మల్కాజిగిరిలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

MLC Balmuri Venkat challenges to resign to fight him in Malkajgiri
MLC Balmuri Venkat : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విసిరిన సవాల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ గట్టిగానే స్పందించారు. రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
అంతేకాదు.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బరిలో దిగుతానని అన్నారు. సిరిసిల్లలో రాజీనామా చేసి తనతో మల్కాజిగిరిలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న కాంగ్రెస్ పార్టీ తరుపున తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తా రా చూసుకుందామని కేటీఆర్‌కు సవాల్ విసిరారు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్.
Read Also : Kodali Nani Comments : జెండా సభలో పవన్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్!
ఎవరివైపు న్యాయం ఉందో ఎవరిని గెలిపించాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారని కెటిఆర్ తెలుసుకోవాలన్నారు. సంస్కారం గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వు వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారో సమాజమంతా చూసిందన్నారు. శాసనసభలో కూడా కేసీఆర్ ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే ఎంత ఎగతాళిగా మాట్లాడారో అందరూ గమనించారని ఎమ్మెల్సీ వెంకట్ గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని సవాల్ విసిరారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నారని ఈ సందర్భంగా మరోసారి ఆయన కేటీఆర్‌కు గుర్తు చేశారు.
కేసీఆర్ సవాల్ స్వీకరించాం.. 65 స్థానాలతో అధికారికంలోకి వచ్చాం :
పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ సవాల్‌ని స్వీకరించి 64 స్థానాలతో పాటు మిత్రపక్షం ఒక సీట్ మొత్తం 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చామని, ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజునే 6 గ్యారంటీలపై చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చేందుకు 24 గంటలు ప్రజాసంక్షేమం కోసమే సీఎం రేవంత్ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజా పరిపాలన కోసమే సెక్రటేరియట్‌లో ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో దళితుడిని సీఎం చేస్తానని చేయలేదన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ యువకులకు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ మోసం చేశారని ఎమ్మెల్సీ బల్మూర్ ఆరోపించారు. రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్నారని, మిగిలిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు.
Read Also : BJP Lok Sabha Candidates : 7 రాష్ట్రాలు, 120మంది అభ్యర్థులు.. తుది దశకు బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా!