Jeevan Reddy : ఎన్డీఏ పదేళ్ల పాలనలో అనుభవించింది చాలు.. శ్రీరాముడితో మీకు పోలికా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వ రాచరిక పాలనకు ముగింపు పలికామో అదేవిధంగా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం పాలన ముగింపుకు నాంది ఈ నిరసన కార్యక్రమం అని అన్నారు.

Jeevan Reddy : ఎన్డీఏ పదేళ్ల పాలనలో అనుభవించింది చాలు.. శ్రీరాముడితో మీకు పోలికా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

MLC Jeevan Reddy

MLC Jeevan Reddy : హిందువుగా శ్రీరాముడిని కొలుస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీరాముడు కేవలం ఏకపత్నివ్రతుడు మాత్రమే కాదని సత్య నిష్ఠ ధర్మ సూత్రాలతో పాలన చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. శ్రీరాముడు ప్రజాభిప్రాయం గౌరవించే విధంగా పాలన చేసి సుపరిపాలన కోసం ఆలీని వదులుకున్న గొప్ప వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తితో మీకేం పోలికని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుతో చేపట్టబడిందన్నారు.

న్యాయస్థానం తీర్పును కులాలకు, మతాలకు అతీతంగా తామందరం గౌరవిస్తామని తెలిపారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాటలు వేసింది ఎల్ కే అద్వానీ అని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం కోసం రథయాత్ర చేపట్టిన వ్యక్తి అద్వానీ అని గుర్తు చేశారు. మరి ఈరోజు అద్వానీ స్థానం ఎక్కడ ఉంది? రామ మందిరం నిర్మాణం దగ్గర కనీసం ఆయన పేరైనా ఉందా? అని ప్రశ్నించారు. పాకిస్తాన్ మెడలు వంచింది ఇందిరాగాంధీ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. ఎన్డీఏ పదేళ్ల పరిపాలన అనుభవించింది చాలు అని అన్నారు.

Bharat Bandh : నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. దేశవ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్

దేశంలో ఉగ్రవాదం పెచ్చు మీరి పోతుందన్నారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా స్మోక్ బాంబు దాడి జరిగిందన్నారు. ఈ దాడిలో తాము తలుచుకుంటే ఏమైనా చేసి చూపిస్తామని దేశ ప్రధానితో పాటు హోం మంత్రి హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వ రాచరిక పాలనకు ముగింపు పలికామో అదేవిధంగా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం పాలన ముగింపుకు నాంది ఈ నిరసన కార్యక్రమం అని అన్నారు.

రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థానాలను గెలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. దేశంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, కర్ణాటక ఇచ్చిన ఫలితాలతో కాంగ్రెస్ కు 100 సీట్లు దాటడం ఖాయమని తెలిపారు.