Kalvakuntla Kavitha : అలాచేయడం ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యం.. రేవంత్ ట్వీట్ కు కవిత స్ట్రాంగ్ కౌంటర్
రేవంత్ ట్వీట్ కు స్పందించిన కవిత ట్విటర్ వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటామని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Revanth Reddy and MLC Kavitha
Kalvakuntla Kavitha – Revanth Reddy : అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. ప్రవళిక ఆత్మహత్య విషయంపై ఇరువురు నేతలు ట్విటర్ వేదికగా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. శనివారం ఉదయం కవిత బతుకమ్మ వీడియోను షేర్ చేశారు. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం – మన తెలంగాణ ఆత్మగౌరవ సంబరం.. బతుకమ్మ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ వీడియోలను, ఆమె పాడిన పాటకు సంబంధించిన వీడియోను కవిత ట్వీట్ చేశారు. కవిత ట్వీట్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Read Also : MLC Kavitha Bathukamma Song: ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా? వీడియో వైరల్
రేవంత్ ఏమన్నారంటే..
బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు.. గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. ఆడబిడ్డల హక్కులు మీ దృష్టిలో రాజకీయ అంగడి సరుకే తప్ప.. పొలిటికల్ స్లోగన్లు తప్ప మానవీయ ఎజెండాలు కాదంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ కు కవిత కౌంటర్..
రేవంత్ ట్వీట్ కు స్పందించిన కవిత ట్విటర్ వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటామని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని కవిత అన్నారు. నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా? అంటూ కవిత ప్రశ్నించారు.
మీ కుట్రలకు బద్దలుకొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది. చివరికి గ్రూప్-2 ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా మీరు కూడా ట్విటర్ లో డిమాండ్ చేయలేదా? అంటూ రేవంత్ రెడ్డిని కవిత ప్రశ్నించారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం మీకు, మీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి అంటూ విమర్శించారు. మీ ఆవేదన బూటకం.. మీ ఆందోళన నాటకం అంటూ కవిత రేవంత్ ట్వీట్ కు తీవ్రస్థాయిలో స్పందించారు.
బతుకమ్మ చేస్తాము..
బాధను కూడా పంచుకుంటాము..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం…ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakh
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023