హైదరాబాద్‌లో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ పనులన్నీ హైడ్రాకు.. బల్దియా అధికారులు హైడ్రా అధీనంలోకి వెళ్తుండటంపై చర్చ

GHMC కమిషనర్‌, జోనల్ కమిషన్‌, డిప్యూటీ కమిషన్‌ ఉండగా అదేలా సాధ్య పడుతుందనేదే డిస్కషన్‌ పాయింట్‌.

హైదరాబాద్‌లో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ పనులన్నీ హైడ్రాకు.. బల్దియా అధికారులు హైడ్రా అధీనంలోకి వెళ్తుండటంపై చర్చ

Updated On : June 10, 2025 / 9:09 PM IST

GHMC నుంచి మరిన్ని అధికారాలు హైడ్రా అధీనంలోకి వెళ్లాయి. లేటెస్ట్‌గా మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ పనులను GHMC నుంచి బదిలీ చేసి హైడ్రా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి వానాకాల విపత్తు నిర్వహణ పనులను కూడా చేపడుతోంది హైడ్రా.

ఇటీవల GHMC రూ.11 కోట్లతో మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ, ఇన్‌స్టంట్‌ రిపేర్స్‌ టీమ్‌ టెండర్లలో గోల్‌మాల్‌ వ్యవహారం పెద్ద దుమారం లేపింది. ఈ ఇష్యూపై ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడంతో ఈ అంశంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. టెండర్ల అవకతవలకు ఇష్యూకు చెక్ పెట్టేలా GHMC నుంచి బదిలీ చేస్తూ హైడ్రాకు మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ పనులను అప్పగించింది రేవంత్ సర్కార్.

వర్షాకాలంలో గ్రేటర్‌ డిస్కం, GHMC, పోలీస్‌, జలమండలి, హైడ్రా శాఖలు అత్యంత కీలకం. అయితే ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ సరిగా లేక లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. వాస్తవానికి GHMC ప్రతి ఏటా మే చివరి వారం నాటికల్లా మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలుకు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి.

Also Read: సందీప్ వంగా నిజాయితీపరుడు అంటూ అనురాగ్ కశ్యప్ పోస్ట్‌.. “No” అంటూ కామెంట్‌ చేసి షాక్ ఇచ్చిన వరుణ్.. ఎందుకంటే?

ఏరియాల వారీగా 140 బృందాలు, ప్రత్యేక వాహనాలు, స్టాటిక్‌ లేబర్స్‌, మినీ మొబైల్‌ మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌లను ఏర్పాటు చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు పిలవాల్సిన అధికారులు ఆలస్యం చేశారు. లేటెస్ట్‌గా మాన్‌సూన్‌ బాధ్యతలను హైడ్రాకు అప్పగించడం, టెండర్‌ ద్వారా ఈ పనులు చేపట్టడంతో, తక్కువ సమయంలో ఇతర శాఖల సమన్వయం ఎంతవరకు సాధ్యమవుతుందో హైడ్రాకు సవాల్‌గా మారిందన్న చర్చ జరుగుతున్నది.

హైడ్రాకు ఈ స్థాయిలో సిబ్బంది లేరు
GHMCలోని ఒక కార్పొరేటర్ వార్డ్ పరిధిలో ఉండే వర్షాకాలం ఎమర్జెన్సీ టీమును వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి మొదలు పెడితే జోనల్ కమిషనర్ వరకు ఆరుగురు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుంటారు. క్షేత్రస్థాయిలో ఉండే వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈ, డీఈ, ఈఈ వంటి అధికారులందరూ డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో పనిచేస్తారు. ఇప్పుడు హైడ్రాకు ఇంతస్థాయిలో వార్డు, సర్కిల్, జోనల్‌ వారీగా సిబ్బంది లేరు.

అక్రమ నిర్మాణాలు, చెరువులు, నాళాల కబ్జాల ఫిర్యాదులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవడానికే హైడ్రాకు ఉన్న సిబ్బంది సరిపోవటం లేదు. దీంతో మాన్‌సూన్‌ టీమ్‌ల నిర్వహణ కోసం బాధ్యత హైడ్రాదే అయినా..వాళ్లు కూడా GHMC సపోర్ట్‌ తీసుకోవాల్సిందే. అయితే హైడ్రా ఆర్డర్స్‌ను GHMC సిబ్బంది సరిగ్గా అమలు చేస్తే ఇబ్బంది ఉండదు. కోఆర్డినేషన్ మిస్ అయితే జనాలకు ఇబ్బందులు తప్పవు.

అయితే GHMC మాన్‌ సూన్‌ సిబ్బంది హైడ్రా కమిషనర్ చెప్పినట్టు వినాలంటూ ఆదేశాలు వస్తే బల్దియాకు హైడ్రా కమిషనర్ షాడో బాస్‌గా వ్యవహరించే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే స్వతంత్రంగా వ్యవహరించాల్సిన GHMC నెమ్మదిగా హైడ్రా చేతుల్లోకి వెళ్తుందా అన్నా డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే GHMC పరిధిలో ఉన్న ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ DRF హైడ్రా చేతుల్లోకి వెళ్లిపోయింది. DRF సిబ్బంది అయితే ఇప్పటికీ GHMC నుంచి జీతాలు తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తున్నారు.

హైదరాబాద్‌లో వర్షం దంచికొడితే కాలనీలు, బస్తీలు నీటిలో మునిగిపోతున్నాయి. గంటల తరబడి వరద రోడ్లపై పారుతుంది. ఇలాంటి సందర్భాల్లో హైడ్రా, GHMC ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో హైడ్రా కమిషనర్ నేరుగా GHMC అధికారులందరికీ బాస్‌గా వ్యవహరిస్తే తప్ప పనుల్లో వేగం పెరగదు.

GHMC కమిషనర్‌, జోనల్ కమిషన్‌, డిప్యూటీ కమిషన్‌ ఉండగా అదేలా సాధ్య పడుతుందనేదే డిస్కషన్‌ పాయింట్‌. ప్రభుత్వం GHMCకి ఆదేశిస్తే బల్దియాకు హైడ్రా కమిషనర్‌ ఇంకో బాస్‌గా ఉండటం పక్కా. మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాల టెండర్ ప్రక్రియలో ghmc అధికారుల కక్కుర్తే హైడ్రా సూపర్ పవర్ గా మారేందుకు కారణమైందనే టాక్ నడుస్తోంది .అయితే బల్దియాకు చెందిన ఒక్కొక్క అంశాన్ని హైడ్రాకు కట్టబెడుతూ..ఓఆర్ఆర్ వరకు ఉన్న లోకల్ బాడీలన్నీ హైడ్రా సూపర్ పవర్ కిందకు తీసుకెళ్తుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.