Moosi Flood : ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి.. చాదర్ ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జీలు మూసివేత, రాకపోకలు నిషేధం

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి వచ్చి చేరుతోంది. నగరంలో మూసీ క్యాచ్ మెంట్ ఏరియాలో భారీగా వర్షం కురవడంతో వరద ఉధృతి పెరుగుతోంది.

Moosi Flood : ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి.. చాదర్ ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జీలు మూసివేత, రాకపోకలు నిషేధం

Moosi flood

Updated On : September 6, 2023 / 7:26 AM IST

Heavy Rains Moosi Flood : భారీ వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాలుస్తోంది. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాగ్ బ్రిడ్డిని తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వంతెనను మూసివేశారు. రాకపోకలను నిషేధించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి వచ్చి చేరుతోంది. నగరంలో మూసీ క్యాచ్ మెంట్ ఏరియాలో భారీగా వర్షం కురవడంతో వరద ఉధృతి పెరుగుతోంది.

హిమాయత్ సాగర్ లో ఆరు గేట్లు, ఉస్మాన్ సాగర్ లో ఆరు గేట్ల ద్వారా 600 క్యూసెక్కుల నీరు మూసీలోకి చేరుతోంది. మూసీ వరద ప్రవాహంతో హైదరాబాద్ లో చాదర్ ఘాట్ బ్రిడ్జిని సైతం క్లోజ్ చేశారు.ఎగువ నుంచి వరద ఉధృతి పెరగడంతో ముందుస్తుగా ఇక్కడ చిన్న వంతెన మూసివేశారు.

Heavy Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. రాత్రంతా కురుస్తూనే ఉన్న వర్షం

బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహించే అవకాశం ఉండటంతో పోలీసులు ట్రాఫిక్ ను పెద్ద వంతెనపైకి మళ్లిస్తున్నారు. దీంతో కోఠి నుంచి మలక్ పేట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.