MP Dharmapuri Arvind : కవితను అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలి-బీజేపీ ఎంపీ అరవింద్

కేసీఆర్, కవిత ఒత్తిడి చెయ్యటం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళారని అరవింద్ అన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందన్నారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. కవితకు ఈడీ నోటీసులతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. అందరూ వెళ్లి ఢిల్లీలో మకాం వేశారని విమర్శించారు.

MP Dharmapuri Arvind : కవితను అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలి-బీజేపీ ఎంపీ అరవింద్

Updated On : March 12, 2023 / 5:13 PM IST

MP Dharmapuri Arvind : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. సుమారు 9 గంటల పాటు కవితను ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో అధికారులు విచారించారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత ఈడీ విచారణతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్, కవిత ఒత్తిడి చెయ్యటం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్ళారని అరవింద్ అన్నారు. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందన్నారు. సీఎం కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. కవితకు ఈడీ నోటీసులతో తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. అందరూ వెళ్లి ఢిల్లీలో మకాం వేశారని విమర్శించారు.

Also Read..MLC Kavitha : లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు-తేల్చి చెప్పిన కవిత

‘ఈడీ విచారణలో కవిత సహకరించలేదని సమాచారం. ఎందుకు? ఏమిటి? ఎలా? అని ఈడీ ప్రశ్నిస్తే.. ఏమో, తెలియదు, గుర్తులేదు అని కవిత చెప్పిందట. ఈడీ విచారణకు సహకరించకపోతే తొందరగా అరెస్ట్ చేస్తారు. తప్పు చేసినందుకు టెన్షన్ పడుతున్నారు. ఇలాగే అన్ని వ్యవహారాల్లో నాయకులు స్పందించాలి. మహిళలపై తెలంగాణలో క్రైమ్ పెరిగి పోయింది. కవిత మీదున్న పది శాతం శ్రద్ధ ప్రజల మీద పెట్టాలి. క్యాబినెట్ ఢిల్లీలో ఏం చేసింది?

Also Read..Delhi Liquor Scam : కవితను జైల్లో వేయాలంటే ఈడీకి ఇంత టైమా?పేరంటానికి పిలిచారా?ఇదంతా బీఆర్ఎస్,బీజేపీ డ్రామాలు : రేవంత్ రెడ్డి

ఇలాంటి దగాకోర్ల ఊబిలో పడి వైసీపీ నేత మాగుంట ఇరుక్కున్నారు. రాజకీయాల్లో అంటరాని వాళ్లు కల్వకుంట్ల కుటుంబం. వాళ్లకు దూరంగా ఉండాలి. కుటుంబ పార్టీలకు ఎంత దూరంగా ఉంటే వ్యాపారస్తులకు అంత మంచిది. కడిగిన ముత్యం అయితే కవిత హడావిడి లేకుండా ఈడీ ముందు హాజరుకావాలి. ఈడీకి సహకరించాలి. మంత్రి కేటీఆర్ క్లీన్ గవర్నమెంట్ పై దృష్టి పెట్టాలి’ అని ఎంపీ అరవింద్ సూచించారు.