Mudiraj Sangham : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై డీజీపీకి ముదిరాజ్ సంఘం నేతల ఫిర్యాదు

పాడి కౌశిక్ రెడ్డి.. ఒక కెమెరా మెన్ ను కులం పేరుతో బూతులు తిట్టి అవమానించారని ఆరోపించారు. గవర్నర్ కు కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Mudiraj Sangham : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై డీజీపీకి ముదిరాజ్ సంఘం నేతల ఫిర్యాదు

Kaushik Reddy (2)

Updated On : June 27, 2023 / 3:53 PM IST

Mudiraj Sangham Complaint : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై ముదిరాజ్ సంఘం నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. జూన్ 22న హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులాన్ని కించపరిచే విధంగా ఫిర్యాదులో మాట్లాడారని పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామని తెలిపారు. ముదిరాజ్ జాతిని అవమాన పరచిన కౌశిక్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరినట్లు పేర్కొన్నారు.

పాడి కౌశిక్ రెడ్డి.. ఒక కెమెరా మెన్ ను కులం పేరుతో బూతులు తిట్టి అవమానించారని ఆరోపించారు. గవర్నర్ కు కూడా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెపుతామని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు : ఈటల సతీమణి జమున

మరోవైపు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ హత్యకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఈటల హత్యకు రూ.20కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నాడంటా అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నాడని ఆరోపించారు.

హుజురాబాద్ లో ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేసి వదిలి పెట్టారని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈటల జమున వ్యాఖ్యానించారు. ఆయన తల్లిదండ్రులు మంచి సంస్కారం నేర్పించారని కౌశిక్ రెడ్డి చెపుతాడని తెలిపారు. ఆయన తల్లిదండ్రుల వద్ద ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి బాగానే ఉన్నాడు కావచ్చు… కానీ, ప్రగతి భవన్ లో చేరి పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు.