Salman Khan: సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు.. మేము అడిగింది ఇవ్వకుంటే లేపేస్తామని హెచ్చరిక

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ వచ్చింది.

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు మళ్లీ బెదిరింపు.. మేము అడిగింది ఇవ్వకుంటే లేపేస్తామని హెచ్చరిక

Salman Khan

Updated On : October 18, 2024 / 9:59 AM IST

Salman Khan Threat Case: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే సల్మాన్ ఖాన్ రూ.5కోట్లు ఇవ్వాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ మెస్సేజ్ ల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. మా బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని.. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా మేము అడిగిన మొత్తాన్ని చెల్లించాలి. లేకుంటే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంగతుకులు హెచ్చరించారు.

Also Read: Somy Ali: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌కి సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు బహిరంగ లేఖ

ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నెంబర్ కు వచ్చిన మెసేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెసేజ్ ఎవరు పంపించారు.. ఏ ప్రాంతం నుంచి వచ్చిందనే విషయాలపై కూపీలాగుతున్నారు. మరోవైపు.. వరుస బెదిరింపులతో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతను ముంబై పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు.