Munawar Faruqui Show : హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద హైటెన్షన్.. వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్స్‌ను అనుమతించని పోలీసులు

మునావర్ ఫారుఖీ షో నేపథ్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద హైటెన్షన్ నెలకొంది. శిల్పకళా వేదిక పరిసర ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు మునావర్ షోకి ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో షోను అడ్డుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు.

Munawar Faruqui Show : హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద హైటెన్షన్.. వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్స్‌ను అనుమతించని పోలీసులు

Updated On : August 20, 2022 / 6:53 PM IST

Comedian Munawar Faruqui Show : మునావర్ ఫారుఖీ షో నేపథ్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద హైటెన్షన్ నెలకొంది. శిల్పకళా వేదిక పరిసర ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు మునావర్ షోకి ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో షోను అడ్డుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు.

దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పాస్ లు ఉన్న వారిని మాత్రమే శిల్పకళా వేదికలోకి అనుమతిస్తున్నారు. షో లోకి వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్లకు సైతం అనుమతి లేదంటున్నారు పోలీసులు. మునావర్ షోని అడ్డుకుంటామని బీజేపీ నేతలు ప్రకటించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

Munawar Faruqui: మునావర్ షో జరిగేనా.. శిల్పకళా వేదిక వద్ద భారీ బందోబస్తు

ఫేమస్ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకి హైదరాబాద్ షోపై సస్పెన్స్ నెలకొంది. శనివారం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో షో జరగాల్సి ఉంది.

కాగా, మునావర్ షోకి శుక్రవారం హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో శిల్పకళావేదికలో సర్వం సిద్ధం చేశారు నిర్వాహకులు. మునావర్ షో టికెట్లను బుక్ మై షో లో విక్రయించగా పూర్తిగా అమ్ముడుపోయాయి. 2 వేల టికెట్స్ సేల్ చేశారు నిర్వాహకులు.

మరోవైపు మునావర్ ఫారుఖీ షోకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షో ను అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. షో జరిగే వేదికను తగలబెడతామని హెచ్చరించారు.

Boycott Amazon: అభ్యంతరకర కృష్ణుడి చిత్రాలు అమ్ముతున్న అమెజాన్.. బాయ్‌కాట్ చేస్తామంటున్న నెటిజన్స్

మునావర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను హేళన చేస్తూ షోలు చేస్తే ఊరుకునేది లేదంటున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. దీంతో రాజాసింగ్ ను పోలీసులు శుక్రవారం అదుపులోనికి తీసుకుని లాలాగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మునావర్ షో ముగిసే వరకు రాజాసింగ్ పోలీసులు అదుపులోనే ఉండనున్నారు. మరోవైపు మునావర్ షో జరిగే హైటెక్ సిటీ శిల్పాకళా వేదిక దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2 వేల మందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు.