Bandi sanjay : కేసీఆర్‌ను గద్దె దించేదాక నా పోరు ఆగదు.. గద్వాల జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర

సీఎం కేసీఆర్‌ను గద్దె దించేదాక నాపోరు ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం 3వరోజు కంచుపాడు...

Bandi sanjay : కేసీఆర్‌ను గద్దె దించేదాక నా పోరు ఆగదు.. గద్వాల జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర

Bandi Sunjay

Updated On : April 16, 2022 / 1:23 PM IST

Bandi sanjay : సీఎం కేసీఆర్‌ను గద్దె దించేదాక నాపోరు ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం 3వరోజు కంచుపాడు నుండి పాదయాత్ర ప్రారంభించి మధ్యాహ్నం వరకు తక్కశిల వరకు పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా సంజయ్ పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు. తక్కశిల వద్ద గ్రామస్తులతో ‘ప్రజల గోస – బీజేపీ భరోసా‘ పేరిట రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.. ప్రజా వ్యతిరేఖ విధానాలతో పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దెదించే వరకు నా పోరాటం ఆగదని అన్నారు.

Bandi Sanjay : భారీ కాన్వాయ్‌తో గద్వాల్‌కు బండి సంజయ్.. ఈ సాయంత్రమే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర..!

ఖమ్మం, రామాయంపేట యువకుల ఆత్మహత్యలకు సీఎం, మంత్రి పువ్వాడ, టీఆర్ఎస్ నేతలే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం, మంత్రులు కండకావరంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడే పార్టీ బీజేపీ కాదని సంజయ్ అన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్‌లో అడ్డగోలుగా కరెంట్ వాడుకున్నాడని, ఒక్క ఫాంహౌజ్‌కు ఇచ్చే కరెంట్ వినియోగంతో పది గ్రామాలకు ఫ్రీగా కరెంట్ సరఫరా చేయొచ్చని, టీఆర్ఎస్ నేతల ఫాంహౌజ్‌ల్లో ఖర్చయ్యే కరెంట్‌తో వందలాది గ్రామాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయొచ్చని బండి సంజయ్ అన్నారు.