nagarjuna sagar bypoll : నోముల్ భగత్ కు బీఫాం, పార్టీ తరపున రూ. 28 లక్షలు ఇచ్చిన సీఎం కేసీఆర్

నాగార్జున సాగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌దేనన్నారు సీఎం కేసీఆర్.

nagarjuna sagar bypoll : నోముల్ భగత్ కు బీఫాం, పార్టీ తరపున రూ. 28 లక్షలు ఇచ్చిన సీఎం కేసీఆర్

sagar bypoll

Updated On : March 29, 2021 / 6:42 PM IST

Nomula Bhagat : నాగార్జున సాగర్‌లో గెలుపు టీఆర్ఎస్‌దేనన్నారు సీఎం కేసీఆర్. సర్వేలన్నీ టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్‌ నేతలు గ్రౌండ్ వర్క్‌ చేశారని నామినేషన్‌ వేసి బరిలోకి దిగాలని నోముల భగత్‌కు సూచించారు. బీజేపీకి అభ్యర్థిలేడని.. టీఆర్ఎస్‌ నుంచి ఎవరైనా వస్తారేమోనని వారు ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ మునిగిపోయే నావ అన్నారు. నాగార్జున సాగర్‌ టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌ను ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ భవన్‌కు చేరుకున్న కేసీఆర్.. ఆయనకు బీఫాం కూడా అందించారు.

యాదవ సామాజిక వర్గం నుంచి అనేక మంది పేర్లు తెరపైకి వచ్చినా… మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ నే కేసీఆర్ బరిలోకి దించుతున్నారు.. ప్రచారం కోసం నోముల భగత్‌కు పార్టీ తరపున 28 లక్షల రూపాయల చెక్‌ను భగత్‌కు అందించారు కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి నోముల నర్సింహయ్యను సీఎం కేసీఆర్‌ అక్కున చేర్చుకున్నారన్నారు.. నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్ అభ్యర్ధి నోముల భగత్‌. నోముల నర్సింహయ్య ఆశయాలను నెరవేరుస్తానని తెలిపారు. తన తండ్రి చనిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పార్టీకీ ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు నోముల భగత్‌.

Read More : Nagarjuna Sagar bypoll : సాగర్ బై పోల్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు