Nagarjuna Sagar : నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కంట్రోల్ రూమ్ పేరు మార్పు.. టీఎస్ ప్రత్యేక రక్షణదళం పేరు తొలగింపు

ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణ బోర్డును తొలగించి దానిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని రాయించారు.

Nagarjuna Sagar : నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కంట్రోల్ రూమ్ పేరు మార్పు.. టీఎస్ ప్రత్యేక రక్షణదళం పేరు తొలగింపు

Nagarjuna Sagar

Nagarjuna Sagar : కృష్ణా జలాల వివాదం తలెత్తిన నేపథ్యంలో నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ ప్రధాన గేట్ సమీపంలో ఉన్న కంట్రలో రూమ్ పేరు మారింది. నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కంట్రోల్ రూమ్ పేరును ఏపీ అధికారులు మార్పారు. టీఎస్ ప్రత్యేక రక్షణదళం పేరును తొలగించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ బోర్డుగా మార్పు చేశారు. ఈ మేరకు ఏపీ అధికారులు పేరు మార్చి రాయించారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణ బోర్డును తొలగించి దానిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని రాయించారు.

కృష్ణ జలాల వివాదంపై డిసెంబర్ 6న కేంద్ర జలశక్తి కీలక సమావేశం నిర్వహించనుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులపై తెలంగాణ, ఏపీ సీఎస్ లతోపాటు కృష్ణా నది బోర్డు యాజమాన్యం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరుగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

M Hari Narayanan : తుఫానును ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తం కావాలి : జిల్లా కలెక్టర్

కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ, నాగార్జున సాగర్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల అంశాలపై చర్చించారు. డిసెంబర్ 6న ఢిల్లీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జల శక్తిశాఖ నిర్ణయించింది.

కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. నాగార్జున సాగర్ దగ్గర పరిస్థితులను వివరించారు.
విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరింస్తోందని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీరు విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

Vijayasai Reddy : యువగళమా లేక స్కూలు పిల్లల్లో బానిస భావాలు పెంచే కార్యక్రమమా : విజయసాయి రెడ్డి

డిసెంబర్ 6వ తేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను దృష్టికి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు మార్చేలా కేఆర్ఎంబీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అందుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించి ఉంచామని తెలిపారు.