Nalgonda : అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ల్లికాట్ సిటీలో ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన మండలి శేఖర్ (28) మృతిచెందాడు

Nalgonda : అమెరికాలో నల్గొండ యువకుడు దుర్మరణం

Nalgonda (2)

Updated On : November 22, 2021 / 2:30 PM IST

Nalgonda : అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ఎల్లికాట్ సిటీలో ఈ నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన మండలి శేఖర్ (28) ప్రాణాలు కోల్పోయాడు. శేఖర్ ఉద్యోగ నిమిత్తం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్ళాడు. కొడుకు మరణ వార్తను ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

చదవండి : Latin American Artist : అరుదైన పెయింటింగ్..చాలా కాస్ట్ గురూ

శేఖర్ మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించిన శేఖర్.. అకాల మరణం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శేఖర్ మృతిపై స్నేహితులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

చదవండి : Amazon delivery truck : పుట్టిన రోజే పునర్జన్మ.. రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు