Sankranti festival : సంక్రాంతి పండుగ వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. నయా టెక్నాలజీ వచ్చేసింది.. ఆగాల్సిన పనిలేదు..
Pantangi TollPlaza : శాటిలైట్ విధానం ద్వారా వాహనం టోల్ బూత్‌లోకి రాగానే కేవలం సెకన్ కాలంలోనే ఫాస్ట్‌ట్యాగ్ స్కాన్ పూర్తవుతుంది. ఈ కొత్త టె క్నాలజీతో నిమిషానికి కనీసం 20 వాహనాలను క్లియర్ చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Pantangi TollPlaza
- సంక్రాంతి పండుగ వేళ వాహనదారులకు శుభవార్త
- నూతన టెక్నాలజీతో ట్రాఫిక్ జామ్‌కు చెక్..
- ప్రస్తుతం పంతంగి టోల్‌ప్లాజా వద్ద మాత్రమే అమల్లోకి
- నిమిషానికి 20 వాహనాలు క్లియర్
- రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో అమలుకు నిర్ణయం
Sankranti festival Hyderabad – Vijayawada highway Pantangi TollPlaza : సంక్రాంతి పండుగ వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు పల్లెబాట పడుతారు. ఈ క్రమంలో వాహనాల రద్దీతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతాయి. పలు ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుండటం చూస్తుంటాం. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద రద్దీ మరీ విపరీతంగా చేరి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.
Also Read : Rythu Bharosa : రైతులకు అలర్ట్.. రైతు భరోసా నిధులు వచ్చేది ఎప్పుడంటే..? తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
వేల సంఖ్యలో వాహనాలు నగరం నుంచి పల్లెబాట పట్టడంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అయితే ఈసారి పంతంగి టోల్ ప్లాజా వద్ద అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్త టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. సాధారణంగా ఫాస్ట్‌ట్యాగ్ స్కాన్ అవ్వడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. ఒక్కోసారి నెట్‌వర్క్ సమస్యల వల్ల మరింత ఆలస్యమవుతుంది. దీనిని అధిగమించేందుకు పంతంగి వద్ద శాటిలైట్ సెన్సార్ విధానాన్ని ట్రయల్ రన్ నిర్వహించారు.
శాటిలైట్ విధానం ద్వారా వాహనం టోల్ బూత్‌లోకి రాగానే కేవలం సెకన్ కాలంలోనే ఫాస్ట్‌ట్యాగ్ స్కాన్ పూర్తవుతుంది. ఈ కొత్త టె క్నాలజీతో నిమిషానికి కనీసం 20 వాహనాలను క్లియర్ చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శాటిలైట్ సెన్సార్లు వాహనం నంబర్ ప్లేట్‌ను గుర్తించి, వేగంగా టోల్ వసూలు చేస్తాయి. ఫలితంగా వాహనాలు టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు.
విజయవాడ హైవేపై అత్యంత రద్దీగా ఉండే పంతంగి టోల్ ప్లాజా మీదుగా సాధారణ రోజుల్లోనే 40వేల వాహనాలు వెళ్తుంటాయి. గత ఏడాది సంక్రాంతికి ఈ సంఖ్య 84,000 దాటింది. ఈ ఏడాది కూడా రద్దీని తట్టుకునేందుకు పంతంగిలోని 16 టోల్ బూత్‌లలో విజయవాడ వైపు వెళ్లే ఎనిమిది బూత్‌లకు శాటిలైట్ సిస్టమ్ అనుసంధానించారు. టెక్నికల్ సమస్యలు రాకుండా ఉండేందుకు ఇప్పటికే విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేశారు.
రద్దీ మరీ ఎక్కువగా ఉంటే, సిబ్బంది హ్యాండ్ గన్ మిషన్ల ద్వారా కూడా టోల్ వసూలు చేసేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి ఈ శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానం కేవలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఇక్కడ విజయవంతమైతే రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాల్లో కూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది.
